హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి టీ20లో పరుగుల వరద పారింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు
ఆరంభం నుంచి ధాటిగా ఆడింది కరీబియన్ జట్టు. రెండో ఓవర్లో సిమన్స్ వికెట్ దీపక్ చాహర్‌కు దక్కింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కింగ్‌తో కలిసి మరో ఓపెనర్ ఎల్విన్ లూయిస్ చెలరేగాడు. 17 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన హెట్మయిర్.. తన టీ20 కెరీర్లో తొలి అర్ధశతకం నమోదు చేశాడు.
మిగతా వారిలో బ్రాండన్ కింగ్ 31, పొలార్డ్ 37, హోల్డర్ 24, రామ్‌దిన్ 11 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో చాహల్ 2.. సుందర్, చాహర్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.