భారత్-దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో మొదటిరోజు ఆట ముగిసింది. తొలుత వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయగా.. తర్వాత వర్షం ప్రారంభమైంది. ఈ కారణంగా ఈ రోజు మ్యాచ్ నిలిచిపోయింది.
మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. మ్యాచ్ నిలిపివేసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ 117(164)*, రహానె 83(135)* క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా నోర్జేకు ఒక వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ (10). పుజారా (0), కోహ్లీ (12) ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను రోహిత్, రహానే ఆదుకున్నారు. మొదటి టెస్టులో రెండు సెంచరీలతో అదరగొట్టిన హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లోనూ సెంచరీతో చెలరేగాడు. మరో ఆటగాడు రహానే కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. ప్రస్తుతం రోహిత్ (117), రహానే (83 క్రీజులో ఉన్నారు.
ఇవీ చూడండి.. శతకంతో చెలరేగిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ