పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజూ టీమిండియా జోరు కొనసాగింది. సారథి కోహ్లీ డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. జడేజా 91 పరుగులతో తనదైన సహకారం అందించాడు. ఫలితంగా టీమిండియా 601 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లక్ష్య ఛేదనలో 36 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు.
-
A good day on the field for #TeamIndia with SA on 36/3 at Stumps on Day 2. Umesh picks 2, Shami gets 1. Join us tomorrow for action from Day 3 #INDvSA @Paytm pic.twitter.com/KRth2PazQO
— BCCI (@BCCI) October 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A good day on the field for #TeamIndia with SA on 36/3 at Stumps on Day 2. Umesh picks 2, Shami gets 1. Join us tomorrow for action from Day 3 #INDvSA @Paytm pic.twitter.com/KRth2PazQO
— BCCI (@BCCI) October 11, 2019A good day on the field for #TeamIndia with SA on 36/3 at Stumps on Day 2. Umesh picks 2, Shami gets 1. Join us tomorrow for action from Day 3 #INDvSA @Paytm pic.twitter.com/KRth2PazQO
— BCCI (@BCCI) October 11, 2019
కోహ్లీ మరోసారి..
ఓవర్‌నైట్ స్కోర్ 273 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు రహానే, కోహ్లీ నాలుగో వికెట్‌కు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. రహానే 59 పరుగులు చేసి ఔటయ్యాక జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు విరాట్. ఈ క్రమంలో డబుల్ సెంచరీని సాధించాడు. 91 పరుగులు(104 బంతుల్లో; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన జడేజా ముత్తుసామి బౌలింగ్‌లో ఔట్ కాగా.. కోహ్లీ డిక్లేర్ ప్రకటించాడు. అప్పటికీ విరాట్ 254* పరుగులు(336 బంతుల్లో; 33 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు.
మూడు వికెట్లు ఢమాల్..
తొలి ఇన్నిగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టును పేసర్ ఉమేష్ యాదవ్ దెబ్బ తీశాడు. తొలిటెస్టులో స్థానం దక్కించుకోలేకపోయిన ఈ ఆటగాడు.. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద మర్కరమ్ (0), 13 పరుగుల వద్ద ఎల్గర్ (6)ను పెవిలియన్ పంపాడు. మూడో వికెట్‌గా బవుమా (8)ను ఔట్ చేశాడు షమి. 15 ఓవర్లకు 36/3 గా ఉన్న సమయంలో రెండో రోజు ఆట ముగిసింది. క్రీజులో డి బ్రూయిన్ (7), బవుమా (7) ఉన్నారు. టీమిండియా కంటే 581 పరుగుల వెనుకంజలో ఉంది దక్షిణాఫ్రికా జట్టు.