మౌంట్ మాంగనుయ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో భారత్.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ.. అర్ధ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 45 పరుగులు చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలో ఓపెనర్ శాంసన్(2) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రాహుల్-రోహిత్ జోడీ.. రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ ఔటయ్యాడు. అనంతరం గాయం కారణంగా 60 పరుగులు చేసి రోహిత్.. రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో శ్రేయస్ అయ్యర్ 33, మనీశ్ పాండే 11, శివమ్ దూబే 5 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో కుగ్లిజన్ 2, బెన్నెట్ ఓ వికెట్ తీశారు.