ఆక్లాండ్‌లో టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో కోహ్లీసేన గెలిచి జోష్ మీదుండగా, ఈరోజు విజయం సాధించి రేసులో నిలవాలని చూస్తోంది కివీస్. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.
తొలి మ్యాచ్‌లో 200లకు పైగా స్కోరు ఛేదించి, 6 వికెట్ల తేడాతో గెలిచింది కోహ్లీసేన. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లోనూ అదే తరహా ప్రదర్శనతో అదరగొట్టాలని చూస్తున్నారు. కివీస్ కూడా అంతకంతకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
జట్లు
భారత్
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్(కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, శార్దుల్ ఠాకుర్
న్యూజిలాండ్
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోదీ, టిమ్ సౌతీ