ETV Bharat / sports

కింగ్ కోహ్లీ.. మరో రెండు ఘనతలు - viratn kohli

అంతర్జాతీయ క్రికెట్​లో 12 వేల పరుగులు చేసిన మూడో కెప్టెన్​గా నిలిచాడు భారత సారథి విరాట్​ కోహ్లీ. ఇంగ్లాండ్​తో రెండో టీ20లో మెరుపు అర్ధశతకంతో రాణించిన అతడు పొట్టి ఫార్మాట్​లో 3 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్​గానూ రికార్డు సృష్టించాడు.

India vs England: Virat Kohli becomes 3rd captain to score 12,000 international runs
కింగ్ కోహ్లీ.. మరో రెండు ఘనతలు
author img

By

Published : Mar 14, 2021, 11:21 PM IST

అంతర్జాతీయ క్రికెట్​లో 12వేల పరుగులు చేసిన 3వ కెప్టెన్​గా నిలిచాడు టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ. అహ్మదాబాద్​లో ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20 సందర్భంగా ఈ ఘనత సాధించాడు.

కోహ్లీ కన్నా ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(15,440), సౌతాఫ్రికా స్టార్​ గ్రేమ్​ స్మిత్ (14,878) ఈ మైలురాయిని అందుకున్నారు. భారత్​ తరఫున 12 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన తొలి కెప్టెన్​ కోహ్లీనే.

ఇక ఇదే మ్యాచ్​తో టీ20ల్లో 3 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు విరాట్. కేవలం తన 87మ్యాచ్​లోనే ఈ ఘనత అందుకున్నాడు. త్వరలోనే ఆ రికార్డును మార్టిన్ గప్తిల్(2839), రోహిత్ శర్మ(2773) అందుకునే అవకాశముంది.

ఇదీ చూడండి: దంచేసిన ఇషాన్​- కోహ్లీ... భారత్​దే గెలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.