పుణెలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ఇండియా బ్యాటింగ్‌కు రానుంది. ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు.. ఈ మ్యాచ్ గెలవాలని ఆలోచిస్తున్నాయి. గత మ్యాచ్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. మరి విజయం ఎవరి సొంతమవుతుందో చూడాలి?
జట్లు
టీమ్ఇండియా:ధావన్, రోహిత్, కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, శార్దుల్ ఠాకుర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్
ఇంగ్లాండ్: జేసన్ రాయ్, బెయిర్‌స్టో, బట్లర్(కెప్టెన్), స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కరన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, లివింగ్‌స్టోన్, రీసి టోప్లే