భారత్ - బంగ్లాదేశ్ జట్లు తొలిసారి డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. శుక్రవారం(నవంబర్ 22)న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గులాబి రంగుతో కళకళలాడనున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. 'పింకూ-టింకూ' పేరుతో తాజాగా అధికారిక మస్కట్లనూ విడుదల చేశాడు. మ్యాచ్ టికెట్టు సహా మస్కట్లను ఈడెన్ మైదానంలో ప్రదర్శించాడు దాదా.
గులాబిమయం...
ఈడెన్ మైదానంలో పెద్ద గులాబి బెలూన్ను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. ఇది ఐదురోజులు కనువిందు చేయనుంది. షాహిద్ మినార్, ఎత్తైన భవంతులు, పార్కులను గులాబి రంగు విద్యుత్తు కాంతులతో అలంకరిస్తోంది అక్కడి ప్రభుత్వం. హూగ్లీ నదిపైన ఓ పడవను గులాబి రంగులో ఏర్పాటు చేయనుంది. ఎల్ఈడీ బోర్డులు, బస్సుల్లోనూ మ్యాచ్‌కు ప్రచారం కల్పించనున్నారు. ఫలితంగా టెస్టులపై మరింత ఆసక్తి ఏర్పడుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజులకు పూర్తిగా టికెట్లు అమ్ముడైనట్లు దాదా వెల్లడించాడు.
-
Time to gear up for the Pink! #TeamIndia begin prep under lights in Indore for the Kolkata Test #INDvBAN pic.twitter.com/MVzkaVjdmL
— BCCI (@BCCI) November 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Time to gear up for the Pink! #TeamIndia begin prep under lights in Indore for the Kolkata Test #INDvBAN pic.twitter.com/MVzkaVjdmL
— BCCI (@BCCI) November 17, 2019Time to gear up for the Pink! #TeamIndia begin prep under lights in Indore for the Kolkata Test #INDvBAN pic.twitter.com/MVzkaVjdmL
— BCCI (@BCCI) November 17, 2019
గోడలపైనా క్రికెట్‌కు సంబంధించిన చిత్రాలను ముద్రించేందుకు ఇప్పటికే క్యాబ్(బెంగాల్ క్రికెట్ అసోసియేషన్) ఓ ప్రైవేటు సంస్థకు పనులు అప్పగించింది. రాత్రి, పగలు కష్టపడుతూ 20 మంది కళాకారులు రంగులు వేస్తున్నారు. మైదానానికి వచ్చే రోడ్లు పూర్తిగా గులాబి రంగులో ఆటగాళ్లకు స్వాగతం పలకనున్నాయి.
గంట మోగగా.. గాల్లోంచి బంతులు
మ్యాచ్ తిలకించేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మ్యాచ్ ఆరంభానికి ముందు వీరిద్దరూ మైదానంలోని గంటను మోగిస్తారు. ఆర్మీకి చెందిన పారా స్టూపర్లు బంతులను ఆకాశం నుంచి నేలపైకి తీసుకురానున్నారు. ఆ తర్వాత టాస్ వేసి మ్యాచ్ ప్రారంభిస్తారు.
- 20 నిముషాల టీ బ్రేక్‌లో.. మాజీ కెప్టెన్లు, క్రీడా ప్రముఖులు, మిగతా అతిథులు కలిసి బౌండరీ లైన్ చుట్టూ మైదానం అంతా చక్కర్లు కొడతారు.
- 40 నిముషాల డిన్నర్ బ్రేక్‌లో చిన్నపాటి టాక్ షో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో దిగ్గజ క్రీడాకారులు సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనీల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ కలిసి 2001లో ఆసీస్‌పై టెస్టు మ్యాచ్ విజయంపై మాట్లాడనున్నారు.
భారత ప్రముఖ క్రీడాకారులు సచిన్ తెందూల్కర్, ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ఆరుసార్లు బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ కోసం ప్రత్యేక అభినందన కార్యక్రమం ఉండనుంది. అంతేకాకుండా బంగ్లాదేశ్-భారత్ జట్లకు సన్మానం చేయనుంది బీసీసీఐ.
-
Looks who's here - unboxing the Pink cherry 😃😃#TeamIndia had a stint with the Pink Ball at the nets today in Indore #INDvBAN 👀👀 pic.twitter.com/JhAJT9p6CI
— BCCI (@BCCI) November 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Looks who's here - unboxing the Pink cherry 😃😃#TeamIndia had a stint with the Pink Ball at the nets today in Indore #INDvBAN 👀👀 pic.twitter.com/JhAJT9p6CI
— BCCI (@BCCI) November 12, 2019Looks who's here - unboxing the Pink cherry 😃😃#TeamIndia had a stint with the Pink Ball at the nets today in Indore #INDvBAN 👀👀 pic.twitter.com/JhAJT9p6CI
— BCCI (@BCCI) November 12, 2019