ETV Bharat / sports

'టీమ్​ఇండియా గెలవడానికి టిమ్​పైన్​ కారణం'

టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా చారిత్రక విజయం సాధించడానికి ఆస్ట్రేలియా సారథి టిమ్​పైన్ ఓ కారణమని​ అన్నాడు భారత బౌలర్​ అశ్విన్​. అతడు చేసిన తప్పిదాల వల్లే భారత్​ గెలిచిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Jan 24, 2021, 2:41 PM IST

టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఘన విజయానికి ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌పైన్‌ కూడా ఓ కారణమని రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి సెటైర్లు వేశాడు. సిడ్నీ టెస్టులో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. 'గబ్బాకు రా చూసుకుందాం' అని పైన్‌ అంటే.. 'నువ్వు ఇండియాకు వస్తే అదే నీ ఆఖరి సిరీస్‌' అంటూ అశ్విన్‌ సైతం సవాల్‌ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ తర్వాత బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తాను అలా చేయాల్సింది కాదన్నాడు.

అశ్విన్‌ తాజాగా టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్.శ్రీధర్‌తో ముచ్చటించాడు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా మరోసారి టిమ్‌పైన్‌పై యశ్​ ఛలోక్తులు విసిరాడు. గబ్బా టెస్టులో అతడు చేసిన తప్పిదాలతో భారత్‌ గెలిచిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. 'రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌(89*)ను స్టంపింగ్‌ చేసే అవకాశాన్ని పైన్‌ వదిలేశాడు. దాంతో నేనతడిని ఇష్టపడటం మొదలెట్టాను. మమ్మల్ని గబ్బాకు రమ్మని పిలిచాడు.. తీరా వెళితే అక్కడ స్టంపింగ్‌ చేసే అవకాశాన్ని వదిలేశాడు. అలా అతడే మాకు సిరీస్‌ను కట్టబెట్టాడు. 2-1 తేడాతో మేం గెలుపొందడానికి కృషి చేశాడని చెప్పను కానీ, మరోలా చెప్పాలంటే అదే చేశాడు' అని అశ్విన్‌ సరదాగా వివరించాడు.

మూడో టెస్టులో అశ్విన్‌(39*), హనుమ విహారి(23*)తో కలిసి ఓటమి వైపు వెళ్తున్న మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఒకవైపు విపరీతమైన వెన్నునొప్పి బాధిస్తున్నా అశ్విన్‌ ఎంతో నిబద్ధతతో ఆడాడు. వీరిద్దరూ 259 బంతులు ఎదుర్కోని చివరి వరకూ క్రీజులో పాతుకుపోయారు. తాము ఔటైతే టెయిలెండర్ల వికెట్లు పడతాయనే ఉద్దేశంతో మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే సిడ్నీ టెస్టును డ్రా చేయడం వల్ల అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురిశాయి. ఆరోజే పైన్‌.. అశ్విన్​ను స్లెడ్జింగ్‌ చేయగా దీటుగా బదులిచ్చాడు.

ఇదీ చూడండి: గబ్బా: 'సర్కస్​లో జోకర్స్​లా ఉంది మా పరిస్థితి'

ఇదీ చూడండి: 'పంత్​ ఆడుతుంటే ఇరుజట్లకు దడే'

ఇదీ చూడండి : 'ఆ నిర్ణయంతోనే ఆసీస్​కు భారత్​ మాస్టర్ స్ట్రోక్'

ఇదీ చూడండి : 'అడిలైడ్ టెస్ట్ నాకు ఆఖరిది అనుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.