ETV Bharat / sports

టెస్టు చరిత్రలో రెండుసార్లే 'టై' - అందులో భారత్​Xఆసీస్​ - భారత్​ ఆస్ట్రేలియా పింక్​ బాల్​ టెస్టు

భారత్​-ఆస్ట్రేలియా లాంటి క్రికెట్​ దేశాల మధ్య పోరు అంటే సాధారణంగా ఉండదు. ఇప్పటికే ఇరు దేశాల మాజీ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. చలికాలంలో వేడి పుట్టించనున్న ఈ టోర్నీ ముంగిట ఇరుజట్ల విజయాల ట్రాక్​ రికార్డు బాగానే ఉంది. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్​లో రెండుసార్లు ఫలితాలు టై అయితే.. అందులో భారత్​-ఆస్ట్రేలియాలు ఉండటం విశేషం.

india vs australia
భారత్​Xఆసీస్​: టెస్టు క్రికెట్​లో 'టై' గురించి తెలుసా..?
author img

By

Published : Nov 26, 2020, 10:25 AM IST

భారత్​-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ త్వరలో​ ప్రారంభం కానుంది. ఇటీవల టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్లను విజయాల శాతం ఆధారంగా లెక్కించడం వల్ల ర్యాంకింగ్స్​లో భారత్​ రెండో స్థానానికి పడిపోయింది. ఆసీస్​ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఛాంపియన్​షిప్​లో ఫైనల్​ చేరాలంటే జరగబోయే సిరీస్​ ఇద్దరికీ చాలా కీలకం. ఫలితంగా త్వరలో జరిగే టెస్టు సిరీస్​పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే టెస్టు చరిత్రలో భారత జట్టుకు చెందిన కొన్ని రికార్డులు మరోసారి గుర్తుచేసుకుందాం.

అత్యధిక విజయాలు..

ఈ ఏడాది జూన్​ నాటికి దాదాపు 542 టెస్టులు ఆడిన భారత జట్టు.. 157 గెలిచింది. 167 మ్యాచ్​ల్లో ఓటమి పాలవగా.. 217 మ్యాచ్​లు డ్రా అయ్యాయి. ఒకటి మాత్రం టై అయింది. ఇందులో ఎక్కువ విజయాలు ఆస్ట్రేలియాపైనే సాధించింది టీమ్​ఇండియా. ఇప్పటివరకు కంగారూలపై 98 మ్యాచ్​లు ఆడి, 28 ​గెలిచింది. అలానే ఎక్కువ మ్యాచ్​ల్లోనూ ఇదే జట్టుపై టీమ్​ఇండియా ఓడిపోయింది. మొత్తంగా 42 మ్యాచ్​ల్లో ఓటమి పాలైంది.

ఒక ఇన్నింగ్స్​లో అత్యధిక స్కోరు..

ఒక టెస్టు ఇన్నింగ్స్​లో అత్యధిక స్కోరు సాధించిన జట్లలో భారత్​కు చోటుంది. 2004లో అస్ట్రేలియాతో జరిగిన టెస్టులో​ 7 వికెట్ల నష్టానికి 705 పరుగులు​ చేసింది. ఈ విభాగంలో నమోదైన టీమ్​ఇండియా వ్యక్తిగత రికార్డుల్లో దీనికి నాలుగో స్థానం దక్కింది. ఇప్పటివరకు 759 పరుగులే భారత్​ పేరిట ఉన్న అత్యధికం.

అత్యధిక పరుగుల ఛేదనలో..

అత్యధిక పరుగుల ఛేదనలో భారత్​కు సరైన రికార్డు లేదు. 1978లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో భారత్​ 493 పరుగులను ఛేదించే క్రమంలో 445 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు భారత్​ పేరిట ఉన్న అత్యధిక ఛేదన వెస్టిండీస్​పై ఉంది. 1976లో కరీబియన్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో 403 పరుగుల లక్ష్యాన్ని టీమ్​ఇండియా పూర్తి చేసింది.

ఇన్నింగ్స్​లో తక్కువ పరుగులు..

టెస్టు క్రికెట్​లో ఒక ఇన్నింగ్స్​లో తక్కువ పరుగులకే ఆలౌటైన జాబితాలోనూ భారత్​ ఉంది. 1974లో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులోని ఓ ఇన్నింగ్స్​లో 42 పరుగులకే ఆలౌటైంది. ఇదే భారత్​ ఖాతాలో అత్యల్ప స్కోరు. 1947లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా చేతిలోనూ భారత బ్యాట్స్​మన్ 58 పరుగులకే చేతులెత్తేశారు.

ప్రత్యర్థులను తక్కువకే..

ఒక ఇన్నింగ్స్​లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకు కట్టడి చేయడంలో భారత్​ ముందుంది. 2015లో జరిగిన ఓ మ్యాచ్​లో 79 పరుగులకే దక్షిణాఫ్రికాను నిలువరించింది. 1981లో ఆస్ట్రేలియాను పరుగులకే ఆల్​ట్ చేసింది.

ఇన్నింగ్స్​ తేడాతో..

ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా 1998లో జరిగిన ఓ టెస్టులో.. ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్​ 219 పరుగుల తేడాతో ఓడించింది టీమ్​ఇండియా. 2008లో ఓ మ్యాచ్​లో 320 పరుగుల తేడాతో కంగారూ జట్టుపై నెగ్గింది భారత్​.

తక్కువ పరుగులతో..

గతంలో ఆస్ట్రేలియాపై తక్కువ పరుగుల తేడాతో నెగ్గింది భారత్​. 2004 నవంబర్​లో జరిగిన బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలోని ఓ మ్యాచ్​లో భారత్​ ఆఖరి ఇన్నింగ్స్​లో 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 93కే ఆలౌట్​ అయింది ఆసీస్​. ఫలితంగా 13 పరుగుల తేడాతో గెలిచింది టీమ్​ఇండియా. తక్కువ తేడాతో భారత్​ గెలిచిన మ్యాచ్​ ఇదే.

తక్కువ వికెట్లతోనూ ఆస్ట్రేలియాపైనే నెగ్గింది భారత జట్టు. 2010లో మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో 1 వికెట్​ తేడాతో గెలిచింది టీమ్​ఇండియా.

అత్యధిక పరుగుల తేడాతో ఓటమి..

భారత్-​ ఆస్ట్రేలియా మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. 2004 అక్టోబర్​లో నాగ్​పుర్​ వేదికగా జరిగిన టెస్టులో.. కంగారూ జట్టు చేతిలో 342 పరుగుల తేడాతో ఓడిపోయింది భారత్​. అత్యధిక పరుగుల తేడాతో ఓటమి పాలవడం భారత్ ఇదే తొలిసారి​.

టై అయింది కూడా..

టెస్టు క్రికెట్​లో టై(స్కోర్లు సమం) అయిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి ఘటన భారత్​-ఆస్ట్రేలియా మ్యాచ్​లో జరిగింది. ఇరు జట్ల ఇన్నింగ్స్​ ముగిసేసరికి స్కోర్లు సమం అయ్యాయి. ఇలా ప్రపంచ టెస్టు క్రికెట్​లో రెండుసార్లు మాత్రమే జరగ్గా.. అందులో రెండింటిలోనూ ఆస్ట్రేలియా చోటు దక్కింది. అయితే ఒకటి దానిలో భారత్​ కూడా భాగస్వామ్యమైంది. 1986 సెప్టెంబర్​ 18న చెన్నై చిదంబరం స్టేడియంలో భారత్​-ఆస్ట్రేలియా మ్యాచ్​లో ఈ అద్భుతం జరిగింది.

ఆసీస్​తో తొలిసారి గులాబి టెస్టు..

ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టేసింది కోహ్లీ సేన. భారత జట్టు పర్యటన నవంబర్‌ 27న ప్రారంభమై జనవరి 19న ముగుస్తుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి ఇరుజట్లు. డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా పింక్​ బాల్​తో తొలి టెస్టు ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.