ETV Bharat / sports

సిడ్నీ టెస్టుకు వర్షం అంతరాయం.. ఆసీస్ 213/3 - సిడ్నీ టెస్టుకు వర్షం అంతరాయం

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

India vs Australia third test match in Sydney
సిడ్నీ టెస్టుకు వర్షం అంతరాయం.
author img

By

Published : Jan 8, 2021, 6:20 AM IST

బోర్డర్​-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మ్యాచ్​కు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. స్మిత్‌ (53) అర్ధశతకం చేశాడు. క్రీజులో స్మిత్‌, వేడ్‌ ఉన్నారు.

రెండో రోజు ఆట ప్రారంభంలోనే ఆసీస్ మూడో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ వైపు దూసుకెళ్తున్న లబుషేన్‌ను(91: 196 బంతుల్లో) రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. ఓ చక్కటి బంతికి లబుషేన్‌ స్లిప్‌లో రహానెకు చిక్కాడు. దీంతో 100 పరుగుల భాగస్వామ్యానికి జడేజా తెరదించాడు.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 166/2తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు స్కోరు 188/2 పరుగుల వద్ద వర్షం ప్రారంభం కావడం వల్ల అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.