ETV Bharat / sports

టీమ్​ఇండియా దెబ్బ అదుర్స్‌ కదూ! - భారత ఆసీస్​ సిడ్నీ టెస్టు వీరంద్ర సెహ్వాగ్​

ఆస్ట్రేలియాతో మూడో టెస్టును డ్రా అయినా సరే టీమ్​ఇండియాపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. మ్యాచ్ ఫలితంలో కీలకంగా వ్యవహరించిన అశ్విన్​, విహారిని నెటిజన్లతో పాటు మాజీలు తెగ పొగుడుతున్నారు.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Jan 11, 2021, 4:59 PM IST

Updated : Jan 11, 2021, 5:31 PM IST

కుడోస్ టీమ్​ఇండియా! మూడో టెస్టులో విజేతలు మీరే. అదేంటి భారత్xఆస్ట్రేలియా టెస్టు డ్రాగా ముగిసింది కదా! భారత జట్టు విజేత ఎలా అవుతుంది అనుకుంటున్నారా? ఆఖరి రోజు భారత్‌ పోరాడిన తీరు చూస్తే సిడ్నీ టెస్టులో రహానె సేనదే నైతిక విజయమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అంత గొప్పగా పోరాడింది. సగటు భారత అభిమాని గర్వించదగ్గ పోరాటమిది.

పంత్‌ సాహసోపేత ఇన్నింగ్స్‌, విహారి-అశ్విన్ బ్లాక్‌థాన్‌ వ్యూహం, పుజారా బలమైన డిఫెన్స్‌, వేలు విరిగినా బరిలోకి దిగడానికి సిద్ధమైన జడేజా తెగువ.. ఇలా సిడ్నీ టెస్టులో టీమ్​ఇండియా చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. అందుకే దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.

"జట్టులో పుజారా,‌ పంత్, అశ్విన్ ఎంత కీలకమో ఇప్పటికైనా అర్థమైందని ఆశిస్తున్నాను. నాణ్యమైన బౌలర్లను తట్టుకుని మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదు. దాదాపు 400 వికెట్లు పడగొట్టడం ఆషామాషీ కాదు. గొప్పగా పోరాడారు. ఇక సిరీస్‌ గెలవాల్సిన సమయం ఆసన్నమైంది"

- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

  • Hope all of us realise the importance of pujara,pant and Ashwin in cricket teams..batting at 3 in test cricket against quality bowling is not always hitting through the line ..almost 400 test wickets don't come just like that..well fought india..time to win the series @bcci

    — Sourav Ganguly (@SGanguly99) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"టీమిండియాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. పంత్‌, పుజారా, అశ్విన్‌, హనుమ విహారి ఈ విజయంలో కీలకంగా నిలిచారు. గొప్పగా ఆడారు"

- సచిన్‌ తెందుల్కర్‌, భారత దిగ్గజ క్రికెటర్​.

"దెబ్బ అదుర్స్‌ కదూ (పంత్ క్రీజులో ఉన్నంత వరకు). సాహసాలు కచ్చితంగా లేవు (పుజారా, విహారి, అశ్విన్‌ బ్యాటింగ్‌). ఈ రెండు వ్యూహాలతో ఇదో గొప్ప టెస్టుగా నిలిచింది. భారత జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. తనను ఎందుకు ప్రత్యేకంగా పరిగణించాలో పంత్ అందరికీ చాటిచెప్పాడు. విహారి, పుజారా, అశ్విన్‌ చూపించిన పట్టుదలను చూస్తే నమ్మశక్యంగా లేదు"

- వీరేందర్ సెహ్వాగ్‌, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

  • Pic1 - Till Rishabh Pant was at the crease.
    Pic2- Pujara, Vihari and Ashwin.

    And the combination of these 2 made it a fantastic Test Match. Feel so so proud of the Team,
    Pant showed why he needs to b treated differently & d grit showed by Vihari, Pujara & Ashwin was unbelievable pic.twitter.com/aU3qN6O3JF

    — Virender Sehwag (@virendersehwag) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"టెస్టు క్రికెట్ ఆసక్తిగా ఉండదని ఎవరన్నారు? టీమ్​ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. గాయాలు, కీలక ఆటగాళ్లు దూరమవ్వడం, ఇతర ప్రతికూలతల్లో మరోసారి గొప్ప ప్రదర్శన చేసింది. పంత్‌ శతకం సాధించకపోయినా గర్వించదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడైన ఆటతో జట్టును పోటీలోకి తీసుకువచ్చాడు"

- వీవీఎస్‌ లక్ష్మణ్‌, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

  • What a remarkable performance by Team India. Once again great show of resilience under grave provocation, spate of injuries and several key players missing. Bravo! #AUSvsIND

    — VVS Laxman (@VVSLaxman281) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"టెస్టు క్రికెట్‌లో మరో గొప్ప మ్యాచ్‌. అడిలైడ్‌ ఘోర ఓటమి అనంతరం మెల్‌బోర్న్‌లో ఘన విజయం సాధించడం, ఇప్పుడు అద్భుత ప్రదర్శనతో సిడ్నీ టెస్టును డ్రా చేయడం ఎంతో ఆకట్టుకుంది. తొడకండరాలు పట్టేసిన విహారి ప్రతికూలతల్లో గొప్ప ప్రదర్శన చేశాడు. విజయలక్ష్మి గారు.. మీ అబ్బాయి (విహారి) చాలా బాగా ఆడుతున్నాడు"

- హర్షాభోగ్లే, కామెంటేటర్​.

  • I have been hugely impressed by the steel and resolve in this Indian team. Whether it was fighting back after Adelaide or saving a lost game here in Sydney. Outstanding.

    — Harsha Bhogle (@bhogleharsha) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భారత్‌×ఆసీస్‌ టెస్టు సిరీస్‌ గొప్పగా సాగుతోంది. ఈ రోజు జరిగిన ఆట సూపర్‌. భారత్‌ ప్రదర్శన అద్భుతం. సిడ్నీలో ఇరు జట్లు గొప్ప పోరాట పటిమ చూపించాయి"

- షేన్‌ వార్న్‌, ఆసీస్​ మాజీ క్రికెటర్​, కామెంటేటర్​.

  • What an amazing test series this is between Aust & India. Today’s test cricket was brilliant & I cannot compliment India enough on their courageous approach & their effort today, just outstanding. Both sides gave it everything they had at the SCG today. Gotta love test cricket ❤️

    — Shane Warne (@ShaneWarne) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'టెస్టు క్రికెట్ అత్యుత్తమం. టీమ్​ఇండియా తమ వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని చాటిచెప్పింది. స్ఫూర్తిదాయక పోరాటమిది"

- కేఎల్ రాహుల్‌, టీమ్​ఇండియా క్రికెటర్​.

  • Unbelievable Grit, determination and character shown by #TeamIndia. What an unbelievably spirited effort and some serious grind. Well done men 🇮🇳 test cricket at its best.

    — K L Rahul (@klrahul11) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: డ్రాగా ముగిసిన భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు

Last Updated : Jan 11, 2021, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.