ETV Bharat / sports

'టీమ్​ఇండియాకు వారిద్దరు కీలకంగా మారతారు'

ఆల్​రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా భవిష్యత్​లో టీమ్‌ఇండియాకు విలువైన ఆటగాళ్లుగా మారతారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆసీస్​పై సిరీస్​ కోల్పోయినప్పటికీ మూడో వన్డేలో భారత్​కు మంచి విజయం దక్కిందని అన్నాడు.

ganguly
గంగూలీ
author img

By

Published : Dec 3, 2020, 10:51 AM IST

ఆల్​రౌండర్లు​ హార్దిక్​ పాండ్యా, రవీంద్ర జడేజాను ప్రశంసించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. భవిష్యత్తులో వీరిద్దరు టీమ్​ఇండియాకు వరంగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. ఆసీస్​తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 13పరుగులు తేడాతో విజయం సాధించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే దాదా ఈ వ్యాఖ్యలు చేశాడు.

"సిరీస్‌ ఓడిపోయినా టీమ్‌ఇండియాకు మంచి విజయం దక్కింది. ఇది సుదీర్ఘ పర్యటన అయినందున ఈ విజయంతోనైనా పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నా. జడేజా, పాండ్యా దీర్ఘ కాలంలో భారత జట్టుకు విలువైన ఆటగాళ్లుగా మారతారు."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​ ఆచితూచి ఆడింది. కానీ వెంటవెంటనే శిఖర్ ధావన్(16), శుభ్​మన్ గిల్(33), కోహ్లీ(63), శ్రేయస్ అయ్యర్(19), కేఎల్ రాహుల్(5) వికెట్లను కోల్పోయింది. దీంతో కనీసం 200 పరుగులు అయినా చేస్తుందా అని​ అభిమానులు అనుకున్నారు.

అయితే చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా(92*), రవీంద్ర జడేజా(66*) వీర విహారం చేశారు. చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆస్ట్రేలియా ముందు 303 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. అనంతరం కంగారూ జట్టు 289 పరుగులకు ఆలౌటై ఓటమి మూటగట్టుకుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్​-ఆసీస్​ ఇంకా మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. డిసెంబర్​ 4న తొలి టీ20 జరగనుంది.

ఇదీ చూడండి : వన్డే సూపర్​ లీగ్​లో ఖాతా తెరిచిన టీమ్​ఇండియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.