ETV Bharat / sports

స్మిత్ సెంచరీ ధమాకా.. భారత్ లక్ష్యం 287 - భారత్-ఆస్ట్రేలియా వన్డే

నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్​కు 287 పరుగుల లక్ష్యాన్నిచ్చింది ఆస్ట్రేలియా. కంగారూ బ్యాట్స్​మన్ స్మిత్(131).. శతకంతో ఆకట్టుకున్నాడు.

భారత్-ఆస్ట్రేలియా వన్డే
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు
author img

By

Published : Jan 19, 2020, 5:16 PM IST

టీమిండియాతో మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో ఆకట్టుకోగా, యువ బ్యాట్స్​మన్ లబుషేన్ తన కెరీర్​లో తొలి అర్ధ శతకం చేశాడు. భారత బౌలర్లలో షమి 4, జడేజా 2 వికెట్లు తీయగా, కుల్​దీప్, సైనీ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్. ఓపెనర్లు వార్నర్ 3, ఫించ్ 19.. తక్కువ పరుగులే చేసి వెనుదిరిగారు. అలాంటి సమయంలో స్మిత్-లబుషేన్ నిలబడ్డారు. మూడో వికెట్​కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 54 పరుగులు చేసిన లబుషేన్.. జడేజా బౌలింగ్​లో కోహ్లీకి క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్​మెన్​లో స్టార్క్ 0, క్యారీ 35, టర్నర్ 4, కమిన్స్ 0, జంపా 1, అగర్ 9 పరుగులు చేశారు.

team india
వికెట్ తీసిన ఆనందంలో భారత క్రికెటర్లు

ఒక్కడై నిలబడిన స్మిత్

ఈ మ్యాచ్​లో ఒక్కడై నిలబడిన స్మిత్.. తన వన్డే కెరీర్​లో తొమ్మిదో సెంచరీ(131) చేశాడు. భారత్​పైనా మూడోది. అదే విధంగా ఆసీస్​ తరఫున, ఈ ఫార్మాట్​లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో నిలిచాడు. 106 ఇన్నింగ్స్​ల్లో ఈ ఘనత సాధించాడు. 93 ఇన్నింగ్స్​లో ఈ మార్క్ చేరుకున్న వార్నర్.. జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.

AP Video Delivery Log - 1000 GMT News
Sunday, 19 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0957: Ukraine Plane Crash AP Clients Only 4249991
Remains of Iran crash victims returned to Ukraine
AP-APTN-0907: Hong Kong Protest AP Clients Only 4249989
Police crack down on Hong Kong protesters
AP-APTN-0900: Germany Libya AU AP Clients Only 4249987
Merkel meets Sassou Nguesso ahead of Berlin talks
AP-APTN-0826: Philippines Volcano 2 AP Clients Only 4249981
Philippines volcano evacuees attend Sunday mass
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.