ETV Bharat / sports

ఖాళీ మైదానాల్లో భారత్​- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్

ఈ ఏడాది చివర్లో జరగబోయే భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​ను ఖాళీ మైదానాల్లో నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్ రాబర్ట్స్ వెల్లడించారు. నాలుగు టెస్టులకు బదులు ఐదు టెస్టుల సిరీస్​పై ఆలోచిస్తున్నామని అన్నారు.

భారత్
భారత్
author img

By

Published : Apr 22, 2020, 9:48 AM IST

కరోనా ప్రభావం వల్ల క్రీడా టోర్నీల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జరగాల్సిన పలు క్రికెట్ సిరీస్​లు రద్దవగా, జరగబోయేవి వాయిదా పడుతున్నాయి. అయితే ఈ ఏడాది చివర్లో జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ మాత్రం యాథావిథిగా జరుగుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ఈ మ్యాచ్​లను ఖాళీ మైదానాల్లో నిర్వాహిస్తామని స్పష్టం చేసింది.

"ప్రస్తుతం కరోనాతో ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే భారత్​తో జరగబోయే సిరీస్​ ద్వారా క్రికెట్ ప్రపంచానికి ఓ సానుకూల వాతావరణం కల్పించాలనుకుంటున్నాం. మైదానంలోకి ప్రేక్షకులు వచ్చినా రాకపోయినా సిరీస్ మాత్రం జరుగుతుంది. ఇప్పటికే బీసీసీఐ, భారత క్రికెటర్లు, జట్టు సహాయ సిబ్బంది అంతా ఆశావహంగా ఉన్నారు. బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. నాలుగు బదులు ఐదు టెస్టుల సిరీస్​పైనా చర్చించాం"

-కెవిన్ రాబర్ట్స్, క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.