రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. విరాట్ మినహా బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. ఈ విషయమై కోహ్లీ స్పందిస్తూ చివరి రెండు వన్డేల్లో బ్యాటింగ్‌పై దృష్టిపెడతామని తెలిపాడు.
314 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 27 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీ ఒంటరి పోరాటంతో శతకం సాధించాడు. మిగిలిన రెండు వన్డేలకు రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇవ్వొచ్చని తెలిపాడు విరాట్.
భారత్ టాప్ఆర్డర్ బలంగా ఉంది. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో ఆటగాళ్లు కృషి చేస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో వికెట్లు త్వరగా కోల్పోయాం. ఈ విషయంపై దృష్టి సారించాం. మరోసారి అలా జరగకుండా జాగ్రత్తపడతాం.
--విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్
బౌలర్లు మంచి ప్రదర్శన కనబర్చారని కోహ్లీ కితాబిచ్చాడు. ఓ దశలో 350 పరుగులకుపైగా ఛేదన చేయాల్సి వస్తుందనుకున్నామని.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులకు అడ్డుకట్ట వేశామని తెలిపాడు. ఫించ్, ఖవాజా అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.
300 పరుగులు చేస్తే చాలనుకున్నాం. ఖవాజా, మాక్స్వెల్, రిచర్డ్సన్ చాలా బాగా ఆడారు. మిగతా వన్డేల్లోనూ ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నాం.
--ఫించ్, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్