టీమిండియా.. ఈ శుక్రవారం నుంచి కివీస్‌తో తలపడనుంది. వారి దేశంలో టెస్టులు, టీ20లు, వన్డేలు ఆడనుంది కోహ్లీసేన. ఇప్పటికే న్యూజిలాండ్ పయనమయ్యారు భారత్ జట్టు సభ్యులు. ఈ నేపథ్యంలో ఈ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కివీస్ మాజీ ఆల్‌రౌండర్ క్రెయిగ్ మెక్ మిలన్. పాస్ మార్కులు తెచ్చుకోవాలంటే మూడింట్లో కనీసం రెండైనా నెగ్గాలని తమ జట్టుకు సూచించాడు.
"ప్రస్తుత భారత్ జట్టు ఓ పవర్‌హౌస్. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా వారు అద్భుతంగా రాణిస్తున్నారు. అందువల్ల ఈ సిరీస్‌లు చాలా ఆసక్తిగా ఉండబోతున్నాయి. కివీస్ పాస్ మార్కులు తెచ్చుకోవాలంటే మూడింటిలో కనీసం రెండైనా గెలవాలి" -క్రెయిగ్ మెక్ మిలాన్, కివీస్ మాజీ ఆల్‌రౌండర్
అదే విధంగా ఈ శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న టీ20 సిరీస్ చాలా ముఖ్యమైనదని అన్నాడు.
"భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20లు జరగనున్నాయి. ఇది అందరికీ ఇష్టమైన ఫార్మాట్. ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఇది మాకు చాలా ముఖ్యమైన సిరీస్" -క్రెయిగ్ మెక్ మిలాన్, కివీస్ మాజీ ఆల్‌రౌండర్
ఇరుజట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు జరగనున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 0-3తో కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్‌పై గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.