జట్టులో అనిశ్చితి కారణంగా గతేడాది ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లో పరాజయం పాలైందని అభిప్రాయపడ్డాడు మాజీ కోచ్ టామ్ మూడీ. జట్టులో బలమైన ఆటగాళ్లు ఉన్నా.. వాళ్లని ఉపయోగించుకోవడంలో యాజమాన్యం విఫలమైందని తెలిపాడు.
"విదేశాల్లో టీమ్ఇండియా రాణించగలదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, విరామం లేని ఆట క్రికెటర్లకు భారం కావచ్చు. జట్టులోని ఆటగాళ్ల ఎంపికతో పాటు టోర్నీలో పాల్గొనడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్న దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే గతేడాది ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రదర్శన."
- టామ్ మూడీ, టీమ్ఇండియా మాజీ కోచ్
"ప్రపంచకప్ ఆడటానికి ఏడాది ముందు నుంచే సిద్ధమైంది భారత్. అయితే టోర్నీలో బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం, బౌలింగ్‌లో మార్పులు చేయటం వంటి నిర్ణయాల వల్ల ట్రోఫీ దూరమైంది. ఇదే టీమ్ఇండియాకు పెద్ద అనిశ్చితి" అని వెల్లడించాడు మూడీ.
2019 ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లన్నీ అవలీలగా గెలిచినా.. ప్రధాన మ్యాచ్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై పరాజయం పాలైంది టీమ్ఇండియా. ఫలితంగా ఇంటిముఖం పట్టింది.