భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వెట్ అవుట్‌ఫీల్డ్ కారణంగా కాస్త ఆలస్యంగా.. 4.15 గంటలకుు టాస్ వేయనున్నారు.
ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. మొదటి టెస్టులో ఓటమితో టెస్టు ఛాంపియన్ షిప్లో తొలి ఓటమి ఎదురైన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్.. టీమిండియాను వైట్‌వాష్ చేయాలని పట్టుదలతో ఉంది.
కివీస్ జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.