ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​: టీ20ల్లో రెండోస్థానానికి కోహ్లీసేన

author img

By

Published : Mar 10, 2021, 7:40 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) టీ20 టీమ్ ర్యాంకింగ్స్​తో పాటు టెస్టు ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. టీ20 టీమ్ ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా రెండోస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో అద్భుతంగా రాణించిన బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​, స్పిన్నర్​ అశ్విన్​ మెరుగైన స్థానాల్లో నిలిచారు.

India move to 2nd spot in ICC T20I team rankings ahead of England series
ఐసీసీ ర్యాంకింగ్స్​: టీ20ల్లో రెండోస్థానానికి కోహ్లీసేన

ఐసీసీ టీ20 టీమ్​ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా రెండోస్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటికే టెస్టుల్లో వరల్డ్​ నంబర్​వన్​ జట్టుగా కొనసాగుతోన్న కోహ్లీసేన.. వన్డేల్లోనూ రెండో ర్యాంకుకు చేరుకుంది. ఇటీవలే న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​లో ఆస్ట్రేలియా ఓటమి కారణంగా.. ఆసీస్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది. దీంతో టీ20 టీమ్ ర్యాంకింగ్స్​లో భారత్​ రెండో స్థానానికి ఎగబాకింది.

అయితే ఈ జాబితాలో ఇంగ్లాండ్​ జట్టు తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్​, భారత్​ మధ్య ఏడు పాయింట్ల వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో త్వరలోనే జరిగే టీ20 సిరీస్​లో కోహ్లీసేన నెగ్గితే.. టీమ్ఇండియా అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది.

టెస్టు ర్యాంకింగ్స్​..

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో అద్భుతమైన బ్యాటింగ్​తో ఆకట్టుకున్న రిషబ్​ పంత్​.. ఐసీసీ టెస్టు బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో టాప్​-10లో అడుగుపెట్టాడు. ఏకంగా 7 స్థానాలు మెరుగు పరచుకొని 9వ ర్యాంక్​కు చేరుకున్నాడు. మరోవైపు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలింగ్​ ర్యాంకుల్లో టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ రెండో స్థానానికి చేరుకోగా.. పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా ఒక స్థానాన్ని కోల్పోయి పదో ర్యాంకులో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన పేసర్​ పాట్​ కమిన్స్​ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆల్​రౌండర్ల జాబితాలోని మూడో స్థానంలో రవీంద్ర జడేజా ఉండగా.. స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ నాలుగో ర్యాంక్​కు చేరుకున్నాడు. అయితే ఈ జాబితాలోని అగ్రస్థానంలో వెస్టిండీస్​ కెప్టెన్​ జాసన్​ హోల్డర్​ కొనసాగుతున్నాడు.

టీ20 ర్యాంకింగ్స్​..

టీ20 ఫార్మాట్​లో బ్యాటింగ్​ ర్యాంకులను అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) బుధవారం విడుదల చేసింది. ఇందులో టీమ్ఇండియా ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ ఒక స్థానాన్ని కోల్పోయి మూడో ర్యాంకుకు చేరుకోగా.. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే టీ20 బౌలింగ్​, ఆల్​రౌండర్ల జాబితాలోని టాప్​-10లో ఒక్క భారత ఆటగాడు లేకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రేక్షకులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.