ETV Bharat / sports

లంచ్ బ్రేక్ : తడబడుతోన్న భారత బ్యాట్స్​మెన్​ - india vs nz first test

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలిటెస్టులో భోజన విరామ సమయానికి భారత జట్టు 79 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్​ పృథ్వీ షా నిరాశ పరచగా.. పుజారా, కెప్టెన్ కోహ్లీ తక్కువ పరుగులకే వెనుదిరిగారు.

india-loses-3-wickets
న్యూజిలాండ్​తో తొలిటెస్టు
author img

By

Published : Feb 21, 2020, 6:40 AM IST

Updated : Mar 2, 2020, 12:53 AM IST

ఆతిథ్య న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలిటెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా భోజన విరామ సమయానికి 79 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్​ జోడి శుభారంభం ఇవ్వలేకపోయింది. 16 పరుగులు చేసిన పృథ్వీ షా... టిమ్​ సౌథీ బౌలింగ్​లో క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా 11 పరుగులకే జేమిసన్​ బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ కోహ్లీ 2 పరుగులు మాత్రమే చేసి జేమిసన్ బౌలింగ్​లోనే నిష్క్రమించాడు.

ఓ దశలో 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయిన టీమిండియాను ఓపెనర్ మయాంక్​ అగర్వాల్​, అజింక్యా రహానే ఆదుకున్నారు. ప్రస్తుతం అగర్వాల్​ 29, రహానే 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Last Updated : Mar 2, 2020, 12:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.