ETV Bharat / sports

టీమిండియా బౌలర్ల సత్తా స్వదేశానికే పరిమితమా..! - టీమిండియా

టీమిండియా బౌలర్లపై ఆసీస్​ ఆటగాడు స్టీవ్​ వా ప్రశంసలు కురిపించాడు. భారత ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడాడు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని సూచించాడు.

india-has-best-fast-bowling-line-world-steve-waugh
టీమిండియా బౌలర్ల సత్తా స్వదేశానికే పరిమితమా..!
author img

By

Published : Feb 18, 2020, 6:43 AM IST

Updated : Mar 1, 2020, 4:43 PM IST

టీమిండియా బౌలింగ్​పై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ వా ప్రశంసల వర్షం కురిపించాడు. కొంతకాలంగా భారత జట్టు బౌలింగ్‌లో మంచి ప్రతిభ కనబరుస్తుందని కొనియాడాడు. ప్రధానంగా భారత్‌ పేస్‌ బౌలర్లు చెలరేగిపోతున్న తీరును ప్రశంసించాడు. కానీ ఆ జట్టు ప్రదర్శన స్వదేశానికి పరిమితమైపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

"ప్రస్తుత టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్‌ అత్యుత్తమంగా ఉంది. పేసర్లు విజృంభించి బౌలింగ్‌ చేస్తూ విజయాలు సాధించి పెడుతున్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన అనేది స్వదేశానికే పరిమితం కావడం కాస్త ఆందోళన కలిగించే అంశం. ఈ విషయంలో ఆసీస్‌ బౌలర్లే ముందంజలో ఉన్నారు. మా పేస్‌ బౌలింగ్‌ ఎక్కడైనా సత్తాచాటగలదు. ఆసీస్‌-టీమిండియా జట్లలో భీకరమైన బౌలర్లు ఉన్నారు. టెస్టుల్లో 20 వికెట్లను సాధించే సత్తా ఇరు జట్ల బౌలర్లలోనూ ఉంది."

- స్టీవ్​ వా, ఆస్ట్రేలియా ఆటగాడు

ఆసీస్​ ఆటగాళ్లు స్వదేశంతో పాటు విదేశాల్లో సత్తా చాటగలరన్నాడు స్టీవ్​ వా. భారత్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు పేసర్ల బౌలింగ్‌ చాలా ప్రమాదకరంగా ఉంటుందని.. ఆసీస్‌, టీమిండియా బౌలింగ్‌లో అద్భుతాలు చేస్తున్నాయని అతడు తెలిపాడు.

బుమ్రా బౌలింగ్ ​శైలి మార్చుకోవాలి..

భారత పర్యటనలో బౌలర్ల దాటికి ఆసీస్​ జట్టు బలహీనంగా మారిందని స్టేవ్​ వా అన్నాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌ అద్భుతంగా ఉందని.. కానీ, అతడి బౌలింగ్‌శైలిని కాస్త మార్చుకోవాలని చాలా మంది కోచ్‌లు చెబుతున్నారని తెలిపాడు. బంతి విసరడంలో వేగం పెంచకపోతే బుమ్రా వికెట్లు తీయడం కష్టమని అంటున్నారని వెల్లడించాడు.

ఇదీ చూడండి.. 'కంబళ వీరుడు' శ్రీనివాస గౌడకు సీఎం సత్కారం

Last Updated : Mar 1, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.