ETV Bharat / sports

ఐపీఎల్​ లేకుండా ఈ ఏడాది పూర్తవదు: గంగూలీ - ఐపీఎల్​ పై మాట్లాడిన గంగూలీ

ఈ ఏడాది పక్కా ఐపీఎల్ జరుగుతుందని చెప్పిన గంగూలీ.. నిర్వహణకు భారత్ తొలి ప్రాధాన్యమని అన్నారు. టీ20 ప్రపంచకప్​ విషయమై ఐసీసీ నిర్ణయం తీసుకున్న తర్వాతే, లీగ్ తేదీ ప్రకటించే అవకాశముంది.

ganguly
గంగూలీ
author img

By

Published : Jul 8, 2020, 4:24 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​-13వ సీజన్​ గురించి మాట్లాడాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. ఈ మెగాటోర్నీ జరగకుండా ఈ ఏడాది ముగియదని చెప్పాడు. కచ్చితంగా లీగ్ జరిగి తీరుతుందని అన్నాడు. దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టోర్నీని విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందని ఇటీవల ఓ బీసీసీఐ అధికారి అన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన దాదా.. భారత్​ తమ తొలి ప్రాధాన్యమని, ఆ తర్వాతే విదేశాల్లో అని పేర్కొన్నాడు.

"ఈ ఏడాది ఐపీఎల్ కచ్చితంగా​ జరుగుతుంది. భారత్​లో నిర్వహించడమే మా తొలి ప్రాధాన్యత. 35-40 రోజుల సమయం దొరికినా టోర్నీని నిర్వహిస్తాం. కానీ ఎక్కడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం"

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ipl
ఐపీఎల్​

ఐసీసీ నిర్ణయం తర్వాతే

ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్​-నవంబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే జరపలేమని ఆసీస్ బోర్డు సంకేతాలు ఇచ్చినా సరే, అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పందించలేదు. అయితే ఐసీసీ, దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాతే ఐపీఎల్​ నిర్వహణ తేదీ ప్రకటిస్తామని అన్నాడు గంగూలీ.

బీసీసీఐ అంగీకరిస్తే,​ తమ దేశంలో ఐపీఎల్​ను​ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్​లు ఆఫర్ చేశాయి.

ఇది చూడండి : 143 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి అలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.