ETV Bharat / sports

భారత్​కు డబ్బు అవసరం లేదు.. అక్తర్​ ప్రతిపాదనపై కపిల్ మాట

author img

By

Published : Apr 9, 2020, 3:58 PM IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్​-పాక్ సిరీస్​పై మాట్లాడటం సముచితం కాదని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. కరోనా విరాళాల కోసం ఇరుదేశాల మధ్య మూడు మ్యాచ్​ల సిరీస్ నిర్వహించాలన్న అక్తర్ మాటలపై స్పందిస్తూ ఇలా అన్నాడు.

అక్తర్
అక్తర్

కరోనా ప్రభావం ప్రతి దేశాన్ని వెంటాడుతోంది. వైరస్​ వల్ల ఆర్థిక నష్టమూ వాటిల్లుతోంది. అయితే కరోనా బాధితులకు సాయం కోసం విరాళాలు ప్రకటిస్తూ ముందుంటున్నారు సినీతారలు, క్రీడాకారులు. ఇదే విషయమై తాజాగా పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. భారత్-పాక్ మధ్య సిరీస్ నిర్వహించి వచ్చిన విరాళాలను రెండు దేశాలు సమానంగా తీసుకోవాలని సూచించాడు. దీనిపై భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్​తో పాటు పాక్ మాజీ బ్యాట్స్​మన్ జహీర్ అబ్బాస్ స్పందించారు.

"ఇప్పుడు డబ్బు కోసం పాకులాడటం సముచితం కాదు. అయినా భారత్​కు ఆర్థిక స్థోమత ఉంది. కరోనా బాధితలకు అండగా బీసీసీఐ ఇప్పటికే ప్రభుత్వానికి 51 కోట్లు విరాళం ప్రకటించింది. అవసరమైతే మరింత ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు క్రికెట్ ద్వారా విరాళాలు సేకరించే అవసరం లేదు. అయినా మూడు మ్యాచ్​ల ద్వారా ఎంత డబ్బు వస్తుంది. ఇంకో ఐదారు నెలల వరకు క్రికెట్ ప్రస్తావన తీయకపోవడమే మంచిది. పరిస్థితులు సద్దుమణిగాక ఆట ప్రారంభమవుతుంది. దేశం కంటే క్రికెట్ గొప్పది కాదు"

-కపిల్ దేవ్, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్

"ఇదే విషయమై పాక్ మాజీ ఆటగాడు జహీర్ అబ్బాస్ స్పందిస్తూ.. "ఇది చాలా కష్టం. చాలా కాలంగా మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పటివరకు జరగలేదు. భవిష్యత్​లో కూడా జరుగుతుందనే నమ్మకం లేదు." అని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.