ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా వరుసగా ఏడోసారి నెగ్గిన రోజు ఇది. ఇంగ్లాండ్ వేదికగా గతేడాది ఇదే రోజు పాక్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత జట్టు విజయకేతనం ఎగురవేసింది. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 113 బంతుల్లో 140 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన కెరీర్లో 24వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.
![India Defeated Pakistan For 7th Time In 50-Over World Cup On This Day In 2019](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7639143_2.jpg)
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. పాక్ జట్టుకు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని విధించారు అంపైర్లు. కానీ 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది పాక్. ఫలితంగా 89 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఏడోసారి పరాజయాన్ని చవిచూసింది.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరిన టీమ్ఇండియా.. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఓటమితో టోర్నీ నుంచి వైదొలిగింది.
ఇదీ చూడండి... 'దాదా నాకు ఎప్పుడూ మద్దతుగా ఉండేవాడు'