రాజ్‌కోట్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
ప్రారంభంలో ధాటిగా ఆడిన పర్యటక జట్టు.. ఆ తర్వాత తడబడింది. వికెట్లు కోల్పోవడం వల్ల అనుకున్నంత మేర స్కోరు చేయలేకపోయింది.
బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో లిట్టన్ దాస్ 29, మహ్మద్ నయీమ్ 36, సౌమ్య సర్కార్ 30, ముష్ఫీకర్ రహీమ్ 4, ఆఫిప్ హుస్సేన్ 6, మహ్మదుల్లా 30, మొసద్దెక్ హుస్సేన్ 7, అమినుల్ ఇస్లామ్ 5 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇది చదవండి: పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మ 'సెంచరీ'