ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​లో ఆ రెండు​ జట్లే ఫేవరెట్: బ్రెట్​లీ​

త్వరలో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్​లో ఆసీస్, భారత జట్లే బలమైనవని అభిప్రాయపడ్డాడు బ్రెట్​లీ. టీమిండియాతో జాగ్రత్తగా ఉండాలని ఇతర జట్లకు సూచించాడు.

India, Australia most impressive teams in Women's T20 World Cup: Brett Lee
టీ20 ప్రపంచకప్​లో ఆ రెండు​ జట్లే ఫెవరేట్: బ్రెట్​లీ​
author img

By

Published : Feb 19, 2020, 5:32 PM IST

Updated : Mar 1, 2020, 8:54 PM IST

మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది మహిళా టీ20 ప్రపంచకప్​. ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ 17 రోజుల పాటు జరగనుంది. ఈ విషయం తనకు గర్వంగా ఉందన్నాడు ఆసీస్​ మాజీ బౌలర్​ బ్రెట్ ​లీ. ఇందులో ఆస్ట్రేలియా, టీమిండియా మేటి జట్లని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వీటితో పాటే మరిన్ని విషయాల్ని పంచుకున్నాడు.

"మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో నిర్వహిస్తుండటం గర్వంగా ఉంది. ఆస్ట్రేలియా, భారత జట్లు ఈ టోర్నీని మరో స్థాయికి చేరుస్తాయని అనుకుంటున్నా. ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్​ ఉండటం ఆసక్తి కలిగిస్తుంది. టీమిండియా.. హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి బ్యాట్స్​ఉమెన్​తో​ దృఢంగా ఉంది. కాబట్టి ఆ జట్టు ఆటతీరుపై కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు వారిని గమనించాలి"

- బ్రెట్ ​లీ, ఆసీస్ మాజీ బౌలర్​

ఇక్కడి వాటిలో మెల్​బోర్న్​ స్టేడియానికి ఓ ప్రత్యేక ఉందని బ్రెట్​లీ అన్నాడు. ఆసీస్​ జట్టు తరఫున అరంగేట్రం చేసిన తర్వాత, 5 వికెట్ల ఘనత తొలిసారి సాధించింది ఈ మైదానంలోనే అని గుర్తు చేసుకున్నాడు. ​ ​

ప్రస్తుతం జరగుతున్నది ఏడో మహిళా టీ20 ప్రపంచకప్‌. ఇందులో ఆస్ట్రేలియా అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌ (2009), వెస్టిండీస్‌ (2018) తలోసారి విజేతగా నిలిచాయి.

ఇదీ చూడండి.. రంజీల్లోనూ డీఆర్​ఎస్ సాంకేతికత​ అమలు

Last Updated : Mar 1, 2020, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.