ETV Bharat / sports

ఫిట్​నెస్​ సాధించిన హార్దిక్.. మళ్లీ మైదానంలోకి - హార్దిక్ పాండ్య గాయం

స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ లీగ్​ డీవై పాటిల్ టీ20 టోర్నీలో పాల్గొనున్నాడు.

ఫిట్​నెస్​ సాధించిన హార్దిక్.. మళ్లీ మైదానంలోకి
ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య
author img

By

Published : Feb 24, 2020, 5:32 PM IST

Updated : Mar 2, 2020, 10:24 AM IST

భారత ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్​నెస్ సాధించాడు. ఇటీవలే జరిగిన ఫిట్​నెస్​ పరీక్షల్లో విఫలమై, జట్టులో చోటు కోల్పోయిన ఇతడు.. ప్రస్తుతం జాతీయ క్రికెట్​ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. నేటి నుంచి ప్రారంభమైన డీవై పాటిల్ టీ20 టోర్నీలో పాల్గొనున్నాడు. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ పాటిల్ చెప్పారు.

లండన్​లో ఐదు నెలల క్రితం వెన్ను గాయానికి సర్జరీ చేసుకున్నాడు హార్దిక్. ఆ తర్వాత నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న కివీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా, ఫిట్​నెస్​ లేని కారణంగా చోటు దక్కించుకోలేకపోయాడు.

India all-rounder Hardik Pandya
స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య

డీవై పాటిలో టోర్నీలో భారత్​కు చెందిన మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, సంజూ శాంసన్, దినేశ్ కార్తిక్.. దేశవాళీ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దివ్యాన్ష్ సక్సేనా, మన్​దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి తదితరులు ఆడుతున్నారు. ఫైనల్​ మార్చి 6న జరగనుంది.

Last Updated : Mar 2, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.