ETV Bharat / sports

మెరిసిన గ్రీన్.. భారత్​పై ఆసీస్​ పైచేయి

మూడు రోజుల వార్మప్ మ్యాచ్​లో భాగంగా రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్​-ఎ జట్టుపై 39 పరుగుల తేడాతో ఆసీస్​ ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతానికి మొదటి ఇన్నింగ్స్​లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది కంగారూ జట్టు. కామెరూన్​ గ్రీన్​ శతకంతో మెరిశాడు.

Green
ఆసీస్
author img

By

Published : Dec 7, 2020, 2:48 PM IST

ఆస్ట్రేలియా-ఎ, భారత్‌-ఎ జట్ల మధ్య జరుగుతోన్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో రెండో రోజు ముగిసేసరికి 39 పరుగుల తేడాతో ఆసీస్​ పైచేయి సాధించింది. కామెరూన్​ గ్రీన్ ​(114*) శతకంతో అజేయంగా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో ఆ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేశ్ ​యాదవ్​(3), మహ్మద్​ సిరాజ్​, రవిచంద్రన్​ అశ్విన్​ చెరో రెండు వికెట్లు తీశారు.

టీమ్​ఇండియా తొలి రోజు ఎనిమిది వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెప్టెన్‌ అజింక్యా రహానె (117*) శతకంతో సత్తాచాటగా, పుజారా (54) అర్ధశతకం సాధించాడు. కాగా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. రెండో రోజు మరో పది పరుగులు జోడించి 247 వద్ద డిక్లేర్ చేసింది భారత్. ఆసీస్​ బౌలర్లలో జేమ్స్​ ప్యాటిన్సన్​(3), హెడ్​(2), నాసర్​(2), బిర్డ్​, స్టెకేట్​ చెరో వికెట్​ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.