లఖ్‌నవూ వేదికగా భారత మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో.. సఫారీలు 21 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిఉంది. 46.3 ఓవర్ వద్ద వర్షం కురవడం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 6 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందినట్లు అంపైర్లు ప్రకటించారు. ఓపెనర్ లిజెల్ లీ(132) శతకంతో అజేయంగా నిలిచి.. జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (77) టాప్ స్కోరర్. ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 46.3 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడం వల్ల డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం 6 పరుగుల తేడాతో సఫారీలు గెలుపొందినట్లు అంపైర్లు ప్రకటించారు. అద్భుత శతకంతో ఆకట్టుకున్న లిజెల్ లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికైంది. దీంతో 2-1 తేడాతో దక్షిణాఫ్రికా జట్టు మిథాలీసేనపై పైచేయి సాధించింది.
ఇదీ చూడండి: 'ఐపీఎల్ వల్ల వైట్‌బాల్ క్రికెట్లో మెరుగయ్యాం'