వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు కేఎల్ రాహుల్. ఈ క్రమంలో టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన మూడో ఆటగాడిగా ఫించ్ సరసన నిలిచాడు.
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్ 26 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 27 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియా ఆటగాడు ఫించ్ 29 ఇన్నింగ్స్‌ల్లో వేయి పరుగులు సాధించి మూడో స్థానంలో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన వెస్టిండీస్ టీమిండియా ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ 8 పరుగులకే ఔటవ్వగా రాహుల్ (62)తో కలిసి సారథి కోహ్లీ రెచ్చిపోయాడు. టీ20 కెరీర్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్ (94) నమోదు చేశాడు. ఫలితంగా భారత్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
ఇవీ చూడండి.. 'రవిశాస్త్రితో విభేదాలా..? అదేం లేదు'