ETV Bharat / sports

భారత్-న్యూజిలాండ్ టెస్టు: తొలి పంచ్ ఎవరిది? - భారత్ న్యూజిలాండ్ తొలి టెస్టు

వెల్లింగ్టన్ వేదికగా రేపు(శుక్రవారం).. భారత్-న్యూజిలాండ్​ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే సిరీస్​ కోల్పోయిన టీమిండియా​.. ఈ సిరీస్​ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇరుజట్ల మధ్య మ్యాచ్​ తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్-న్యూజిలాండ్ టెస్టు: తొలి పంచ్ ఎవరిది?
భారత్-న్యూజిలాండ్ టెస్టు
author img

By

Published : Feb 20, 2020, 10:46 PM IST

Updated : Mar 2, 2020, 12:24 AM IST

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. వెల్లింగ్టన్​ వేదికగా శుక్రవారం జరగనున్న తొలి టెస్టులో.. కివీస్-భారత్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే టీ20లను భారత్, వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్‌ క్లీన్​స్వీప్ చేశాయి. ఈ నేపథ్యంలో సుధీర్ఘ ఫార్మాట్‌లో ఎవరు సత్తా చాటుతారనేది ఆసక్తికరంగా మారింది. భారత కాలమానం ప్రకారం రేపు(శుక్రవారం) తెల్లవారుజామున 4 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని పర్యటనను విజయవంతంగా ముగించాలని కోహ్లీసేన భావిస్తోంది. బ్యాటింగ్​లో పటిష్టంగా ఉన్న భారత్​... న్యూజిలాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే కోహ్లీసేన కొద్దిగ స్వింగ్‌కు తడబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బౌల్ట్‌, సౌథీ వంటి పేసర్లను ఎదుర్కోవడం... బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గా మారనుంది.

TEAM INDIA
మైదానంలో భారత క్రికెటర్ల ప్రాక్టీసు

మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తెలుగబ్బాయి విహారీ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ప్రాక్టీస్​లో పంత్ అర్ధశతకంతో రాణించినా.. సాహా తుది జట్టులో చోటు సంపాదించుకోనున్నాడు.

బౌలింగ్‌లో బుమ్రా, షమి, ఇషాంత్‌ శర్మతో కూడిన పేస్‌ దళం.. టీమిండియాకు బలంగా ఉంది. ఏకైక స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా తుది జట్టులో ఉండొచ్చు.

shami with prithvi shaw
పృథ్వీషాతో బౌలర్ షమి

మరోవైపు వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో కివీస్‌ బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్​, బౌలింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. అరంగేట్ర వన్డేలో అద్భుతంగా రాణించిన పేసర్ జేమిసన్.. టెస్టుల్లోనూ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మ్యాచ్‌ వేదికైన బేసిన్‌ రిజర్వ్‌ పిచ్‌.. పేస్‌ బౌలర్లకు స్వర్గధామం. అంతేకాకుండా బంతి స్వింగ్​ అయ్యే అవకాశముందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. గాలులు వీచే అవకాశమున్న నేపథ్యంలో పిచ్‌ అటు బౌలర్లకు, ఇటు బ్యాట్స్‌మెన్‌కు పరీక్షగా నిలవనుంది.

IND vs NZ 1st Test
వెల్లింగ్టన్ మైదానం

Last Updated : Mar 2, 2020, 12:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.