ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్ టీ20లో నమోదైన రికార్డులు ఇవే! - భారత్-ఇంగ్లాండ్ టీ20 విశ్లేషణ

ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టీ20లో విజయం సాధించింది టీమ్ఇండియా. ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

IND vs ENG T20
భారత్-ఇంగ్లాండ్ టీ20లో నమోదైన రికార్డులు ఇవే
author img

By

Published : Mar 19, 2021, 9:53 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టీ20లో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమ్ఇండియా. ఉత్కంఠ పోరులో గెలిచి సిరీస్​ను 2-2 తేడాతో సమం చేసింది. చివరి టీ20లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ చేసిన తొలి మ్యాచ్​లోనే అర్ధశతకం చేసిన సూర్యకుమార్ యాదవ్, రోహిత్ 9 వేల పరుగులు, హార్దిక్ పాండ్యా సూపర్ బౌలింగ్​తో పాటు ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

  • 2020 నుంచి చూసుకుంటే టీమ్ఇండియా తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు శార్దూల్ ఠాకూర్. ఇతడు 20 వికెట్లు దక్కించుకోగా చాహల్, సుందర్ చెరో 10 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బుమ్రా 8 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
  • ఇంగ్లాండ్​ జట్టుపై టీ20ల్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి తక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్​గా నిలిచాడు హార్దిక్ పాండ్యా. ఇతడు 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇంతకుముందు బుమ్రా 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
  • బ్యాటింగ్ చేసిన తొలి టీ20 మ్యాచ్​లోనే అర్ధశతకం చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు సూర్య కుమార్ యాదవ్. ఇతడి కంటే ముందు ఈ జాబితాలో రాబిన్ ఉతప్ప (2007), రోహిత్ శర్మ (2007), అజింక్యా రహానే (2011), ఇషాన్ కిషన్ (2021) ఉన్నారు.
  • విరాట్ కోహ్లీని ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అదిల్ రషీద్. ఇతడు కోహ్లీని 8 సార్లు పెవిలియన్ చేర్చాడు. బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, అండర్సన్, గ్రేమ్ స్వాన్ కూడా 8సార్లు విరాట్​ను ఔట్ చేశారు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ 10 సార్లు కోహ్లీ​ని ఔట్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
    IND vs ENG T20
    ఇంగ్లాండ్
  • టీ20ల్లో భారత గడ్డపై ఎక్కువ సిక్సులు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. ఇతడు స్వదేశంలో 50 సిక్సులు సాధించాడు. కోహ్లీ (48), యువరాజ్ సింగ్ (32) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • టీ20ల్లో 9 వేల పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఇతడి ఖాతాలో 9001 పరుగులు ఉన్నాయి. గతేడాది ఈ ఘనతను చేరుకున్నాడు విరాట్ కోహ్లీ.
    IND vs ENG T20
    రోహిత్
  • ఎక్కువ మ్యాచ్​ల్లో కనీసం ఒక్క సిక్స్​ బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు రోహిత్ శర్మ. ఇతడితో పాటు కోహ్లీ 95 మ్యాచ్​ల్లో కనీసం ఒక సిక్సయినా బాదారు. ధోనీ (105) అగ్రస్థానంలో ఉండగా, రైనా (98) తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.
  • ఇంగ్లాండ్​తో జరిగిన ఈ మ్యాచ్​లో కోహ్లీ స్టంపౌట్​గా వెనుదిరిగాడు. టీ20ల్లో ఇలా ఔట్ అవ్వడం కోహ్లీకి ఇదే మొదటిసారి.
  • టీ20ల్లో ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్సు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.