భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం పుణె వేదికగా జరుగుతోన్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఓ కొత్త రికార్డు నమోదైంది. అత్యధిక సిక్స్‌లు నమోదైన మూడు మ్యాచ్లై వన్డే సిరీస్‌గా ఇది నిలిచింది.
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 11 సిక్సులు బాదింది. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్లవి మొత్తం 63 సిక్సులు నమోదయ్యాయి. అంతకుముందు 2019లో శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో 57 సిక్స్‌లు నమోదయ్యాయి. ఇప్పుడా రికార్డును ఈ సిరీస్ చెరిపేసింది.
ఈ మ్యాచ్‌లో భారత్ ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్(67), పంత్(78), హార్దిక్ పాండ్య(64) అర్ధ శతకాలతో అదరగొట్టారు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా ఆలౌట్.. ఇంగ్లాండ్ లక్ష్యం 330