ETV Bharat / sports

హాట్​కేకుల్లా అమ్ముడైన తొలి టీ20 టికెట్లు - భారత్

టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న తొలి టీ20పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్​కు సంబంధించిన 40 వేలకు పైగా టికెట్లను విక్రయించినట్లు నిర్వహాకులు తెలియజేశారు.

IND vs ENG: Over 40,000 tickets for 1st T20I sold
తొలి టీ20కి అమ్ముడైన 40వేల పైచిలుకు టికెట్లు
author img

By

Published : Mar 11, 2021, 2:50 PM IST

Updated : Mar 11, 2021, 2:55 PM IST

ఇంగ్లాండ్​తో జరిగే తొలి టీ20 మ్యాచ్​కు సంబంధించిన టికెట్లు హాట్​కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇప్పటికే 40 వేలకు పైగా టికెట్లు విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇటీవలే జరిగిన రెండు టెస్టులకు పెద్దగా ప్రేక్షకులు హాజరుకాలేదు. కానీ శుక్రవారం (మార్చి 12) నుంచి ప్రారంభమయ్యే పొట్టి ఫార్మాట్​కు వీక్షకుల సంఖ్య భారీగా ఉండే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఆన్​లైన్​తో పాటు స్టేడియం వద్ద ఆఫ్​లైన్​లోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. టీ20 సిరీస్​లోని ఐదు మ్యాచ్​లూ.. ఇదే వేదికగా మార్చి 14, 16, 18, 20 తేదీల్లో జరగనున్నాయి. ఈ సిరీస్​లోని ప్రతి టీ20 మ్యాచ్​ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.

ఇదీ చూడండి: 'కొత్త వారం, కొత్త ఫార్మాట్​.. లక్ష్యం మాత్రం అదే'

Last Updated : Mar 11, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.