ETV Bharat / sports

ప్లాన్​లో​ మార్పు లేదు.. బెయిర్​స్టో వచ్చేది అప్పుడే - చెన్నై

భారతతో ఆడే మూడో టెస్టు నుంచే ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ బెయిర్​ స్టో అందుబాటులో ఉంటాడని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సహాయ కోచ్​ చేసిన ప్రకటనను తోసిపుచ్చింది.

IND vs ENG: No change in plan, Bairstow to join team for third and fourth Test
ప్లాన్​ మార్పు లేదు.. బెయిర్​స్టో ఆడేది అప్పుడే
author img

By

Published : Jan 29, 2021, 8:14 PM IST

భారత్​తో తొలి రెండు టెస్టుల తర్వాతే ఇంగ్లాండ్​ జట్టుతో బెయిర్​స్టో కలుస్తాడని ఇంగ్లాండ్ , వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. తొలుత నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే అతడు భారత్​లో ఆడతాడని శుక్రవారం చెప్పింది. అంతకుముందు ఇంగ్లాండ్ బ్యాటింగ్ సహాయ కోచ్​ గ్రాహమ్ తోర్ప్.. తొలి టెస్టు పూర్తి కాగానే బెయిర్​స్టో తమ జట్టుతో కలిసి ఆడతాడని తెలిపారు. ఈ మేరకు ఈసీబీ వివరణ ఇచ్చింది.

IND vs ENG: No change in plan, Bairstow to join team for third and fourth Test
ఇంగ్లాండ్ , వేల్స్ క్రికెట్ బోర్డు

తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాట్స్​మెన్ బెయిర్​ స్టోను పక్కన పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమ నిర్ణయం సరైందేనని మరోసారి చెప్పింది ఈసీబీ. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటివి తప్పవని తెలిపింది.

భారత​ పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. చెన్నైలో ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో సిరీస్​ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: హోటల్​ గదిలో చెమటలు చిందిస్తున్న విరాట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.