ETV Bharat / sports

రెండో వన్డేకు ముందు ఇంగ్లాండ్​కు ఎదురుదెబ్బ!

author img

By

Published : Mar 24, 2021, 12:24 PM IST

వన్డే సిరీస్​లో ఇంగ్లాండ్ జట్టు గాయాల సమస్య వేధిస్తోంది. కెప్టెన్​ మోర్గాన్​తో పాటు సామ్ బిల్లింగ్స్.. రెండో వన్డేలో ఆడేది సందేహంగానే కనిపిస్తోంది.

Morgan doubtful for 2nd ODI
ఇయాన్ మోర్గాన్

టీమ్​ఇండియాతో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో బాధపడుతున్న కెప్టెన్ మోర్గాన్​, సామ్ బిల్లింగ్స్ రెండో మ్యాచ్​లో ఆడేది అనుమానంగా కనిపిస్తోంది.

మోర్గాన్ బొటన, చూపుడు వేళ్ల మధ్యలో కుట్లు వేయాల్సి ఉండగా, భుజం ఎముక పట్టేయడం వల్ల బిల్లింగ్స్​కు గాయపడ్డాడు. 48 గంటలు గడిస్తే గాని గాయాల తీవ్రత గురించి చెప్పలేనని మ్యాచ్​ అనంతరం మోర్గాన్ చెప్పాడు.

Billings doubtful starters for 2nd ODI
ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్

పుణె వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీమ్​ఇండియా బ్యాట్స్​మన్ ధావన్, కోహ్లీ, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య అర్ధ శతకాలతో ఆకట్టుకునే ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.