ETV Bharat / sports

సూర్య, శ్రేయస్ మెరుపులు.. ఇంగ్లాండ్​ లక్ష్యం 186

author img

By

Published : Mar 18, 2021, 9:08 PM IST

నాలుగో టీ20లో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్​ఇండియా 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్​ అరంగేట్రంలోనే అర్ధశతకంతో చెలరేగాడు. జోఫ్రా ఆర్చర్​ 4 వికెట్లు తీసి​ భారీ స్కోరు సాధించకుండా భారత్​ను నిలువరించాడు.

ind vs eng: india firdt innings score in 4th t20
సూర్య, శ్రేయస్ మెరుపులు.. టీమ్​ఇండియా​-185/8

నాలుగో టీ20లో ఇంగ్లాండ్​ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్​ఇండియా. కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రంలోనే చెలరేగాడు. అర్ధశతకానికి(57) తోడు ఆఖర్లో శ్రేయస్ అయ్యర్​(37) మెరిశాడు. ఉన్నంతసేపు రిషభ్​ పంత్(30)​ కూడా ధాటిగానే ఆడాడు. ఓపెనర్లు మాత్రం మరోసారి విఫలమయ్యారు.

ఇంగ్లాండ్​ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లతో టీమ్​ఇండియాను దెబ్బతీశాడు. ఆదిల్, స్టోక్స్, సామ్ కరన్, వుడ్ తలో వికెట్ తీశారు.

సూర్య మెరుపులు..

వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు సూర్యకుమార్. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో మురిపించాడు. 3 సిక్సర్లు, 4 ఫోర్లతో ధనాధన్ అర్ధశతకం(57) సాధించాడు. అయితే 14వ ఓవర్లో సామ్​ కరన్​ బౌలింగ్​లో మరో షాట్​కు ప్రయత్నించిన అతడు మలన్​కు దొరికిపోయాడు.

ఔటేనా?

సూర్యకుమార్​ ఔట్​ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంతిని చేతిలోకి తీసుకున్న తర్వాత మలన్​ దానిని నేలకు అంటించినట్లు కనిపించింది. అయితే చాలా సేపు తర్జనభర్జనలు పడిన థర్డ్ అంపైర్.. ఏ కోణంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో ఫీల్డ్​ అంపైర్ నిర్ణయం ప్రకారం అతడిని ఔట్​గా ప్రకటించారు.

టాప్​ఆర్డర్​ ప్చ్​..

ఇన్నింగ్స్​ తొలి బంతినే సిక్సర్​గా మలిచిన రోహిత్.. అదే జోరును కొనసాగించలేకపోయాడు. ఈ మ్యాచ్​లోనైనా తిరిగి ఫామ్​లోకి వస్తాడనుకున్న కేఎల్​ రాహుల్​ కేవలం 14 పరుగులతో నిరాశపరిచాడు. ఇక గత రెండు మ్యాచుల్లో భీకర ఇన్నింగ్స్​ ఆడిన కెప్టెన్ కోహ్లీ.. ఆదిల్​ రషీద్​ బౌలింగ్​లో స్టంప్ ఔట్​గా వెనుదిరిగాడు.

ఇదీ చూడండి: ఫలించిన నిరీక్షణ- 'సూర్య' సునామీకి సిద్ధమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.