ETV Bharat / sports

భారత్​తో టీ20లకు స్పిన్​ పిచ్​లైతేనే మేలు: మోర్గాన్ - ఇయాన్ మోర్గాన్

ఐదు టీ20ల సిరీస్​లో భాగంగా స్పిన్​ పిచ్​లను ఆశిస్తున్నట్లు ఇంగ్లాండ్​ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. భారత్​లో టీ20 వరల్డ్​ కప్​ జరగనున్న నేపథ్యంలో స్పిన్​ పిచ్​లపై మ్యాచ్​లు అవసరమని అభిప్రాయపడ్డాడు. 2016 వరల్డ్​ కప్​లో పలు లో స్కోరింగ్ మ్యాచ్​లు జరిగనట్లు గుర్తు చేసుకున్నాడు.

Ind vs Eng: Hoping for turning pitches in T20I series, says Morgan
భారత్​తో టీ20లకు స్పిన్​ పిచ్​లైతేనే మేలు: మోర్గాన్
author img

By

Published : Mar 11, 2021, 1:37 PM IST

భారత్​తో టీ20 సిరీస్​కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ప్రపంచ కప్​కు ముందు స్పిన్​ పిచ్​ల అనుభవం సంపాదించాలనుకున్నట్లు పేర్కొన్నాడు. భారత్​తో జరగనున్న 5 మ్యాచ్​ల పొట్టి సిరీస్​కు తమ జట్టు టర్నింగ్​ పిచ్​లు ఆశిస్తున్నట్లు తెలిపాడు.

"మేము గత రెండేళ్లుగా టీ20ల్లో అద్భుత విజయాలను నమోదు చేశాం. ఈ ఫార్మాట్​లో మా జట్టు మంచి ఫామ్​లో ఉంది. సానుకూల దృక్పథంతో ఉన్నాం. టీ20 ప్రపంచ కప్​కు ముందు అన్ని బలహీనతలు అధిగమిస్తూ.. ఆటతీరు మరింత మెరుగు పరుచుకోవడం అవసరం. సాధ్యమైనంత వరకు బలమైన జట్టుతో వరల్డ్​ కప్​లో బరిలోకి దిగాలనుకుంటున్నాం. తక్కువ స్కోర్లు నమోదయ్యే టర్నింగ్​ పిచ్​లు ఉంటే మేలు. దాని వల్ల మాకు తగిన ప్రాక్టీస్ లభిస్తుంది."

-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ టీ20 కెప్టెన్.

"టెస్టు సిరీస్​లోని అన్ని మ్యాచ్​లకు ఒకే తరహా పిచ్​ ఉండాలని నేను కోరుకోను. స్పిన్​ వికెట్​ కూడా ఉండాలనుకుంటాను. ఫ్లాట్​ పిచ్​లపై మేమేంటో మాకు తెలుసు. స్పిన్ పిచ్​లపై మా బౌలర్లు ఇంకా నేర్చుకుంటున్నారు. ఇండియాలో టీ20 వరల్డ్​ కప్​ జరగనున్న నేపథ్యంలో.. తక్కువ స్కోర్లు నమోదయ్యే పిచ్​లు మాకు ఎదురు కావాలని ఆశిస్తున్నాం" అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలో ఈ పర్యటన ప్రతి ఒక్కరికీ సవాలు లాంటిదని మోర్గాన్​ అభిప్రాయపడ్డాడు. 2016 టీ20 ప్రపంచ కప్​లోని పలు మ్యాచ్​ల్లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి పిచ్​లు ఎదురవ్వాలని ఆశిస్తున్నామని ఇంగ్లాండ్​ కెప్టెన్ పేర్కొన్నాడు.

జోఫ్రా ఫిట్!

జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం ఫిట్​గా ఉన్నాడని మోర్గాన్ వెల్లడించాడు. మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలిపాడు. టీ20లకు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, జోఫ్రా అందుబాటులో ఉండేది లేనిది వైద్యబందం సూచన మేరకు నిర్ణయిస్తామని ఇంగ్లాండ్​ కోచ్​ సిల్వర్​వుడ్​ ఇది వరకే తెలిపాడు.

భారత్​తో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ మార్చి 12 నుంచి ప్రారంభం కానుంది. అన్ని మ్యాచ్​లకు అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

ఇదీ చదవండి: 'ది మొతేరా థాలీ ఛాలెంజ్​'కు మీరు సిద్ధమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.