రెండో టెస్టుకు వేదికైన చెన్నై చెపాక్ పిచ్‌పై.. ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్ ఆశ్చర్యానికి గురి చేస్తోందన్న వాన్.. ఐదు రోజుల మ్యాచ్‌కు ఏ మాత్రం పనికిరాదన్నాడు. పేస్ బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలించని ఈ పిచ్‌పై సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడటం కష్టతరమవుతుందన్నాడు.
"ప్రేక్షకులకు వినోదాన్నిచ్చే టెస్ట్ క్రికెట్లో ఇలాంటివి సాధారణం. కానీ చెన్నై వేదిక గురించి వాస్తవాలు మాట్లాడుకుంటే.. చెపాక్ పిచ్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వికెట్‌పై టీమ్ఇండియా మెరుగ్గా ఆడటంపై ఏ సాకులూ చెప్పడం లేదు. కానీ.. ఇది ఐదు రోజుల మ్యాచ్‌కు సిద్ధం చేసిన పిచ్‌లా లేదు."
- మైకేల్ వాన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
మ్యాచ్ తొలిరోజు నుంచే గింగిరాలు తిరుగుతోన్న ఈ పిచ్‌పై స్పిన్ బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు మొత్తం 15 వికెట్లు నేలకూలాయి. అందులో భారత స్పిన్నర్లు 7 వికెట్లు దక్కించుకోగా.. ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు 6 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 134పరుగులకే అలౌట్ చేసి భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్(195)తో కలుపుకొని ఇప్పటికే 249 పరుగుల ఆధిక్యం సాధించిన టీమ్ఇండియా.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ ఆడించకుండా మరోసారి బ్యాటింగ్‌కు దిగి.. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రోహిత్ శర్మ(25), పుజారా(7) క్రీజులో ఉన్నారు.
ఇదీ చదవండి: చెన్నై టెస్ట్‌లో అశ్విన్ మరో రికార్డు