ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ పిచ్‌పై ఆతిథ్య జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెపాక్‌లో మ్యాచ్ సాగేకొద్దీ పిచ్ మందకొడిగా తయారవుతుందని చెప్పాడు. మూడు, నాలుగో ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నాడు. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 300 స్కోరు సాధించినా.. చెపాక్ పిచ్‌పై 500 పరుగులకు సమానమని ట్వీట్ చేశాడు వాన్.
భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో తొలి టెస్ట్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించలేదు. అయితే.. అదే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ వికెట్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు చక్కని సహకారం లభిస్తోంది.
రోహిత్ శర్మ భారీ శతకంతో రాణించాడు. 161 పరుగులు చేసి వెనుదిరిగాడు. రహనె తన టెస్ట్ కెరీర్లో 23వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమ్ఇండియా స్కోరు 250 దాటింది.
ఇదీ చదవండి: చెన్నై టెస్టు: రోహిత్ శతకం- అరుదైన రికార్డు