ETV Bharat / sports

తొమ్మిదోసారి కోహ్లీని ఔట్​ చేసిన రషీద్​ - tim southee

ఇంగ్లాండ్ స్పిన్నర్​ ఆదిల్ రషీద్​ కొత్త రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్​లో.. విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు ఔట్​ చేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు విరాట్​ను 9 సార్లు పెవిలియన్ చేర్చాడు.

Ind vs Eng, 2nd ODI: Rashid dismisses Kohli for the ninth time in international cricket
9 సార్లు కోహ్లీని ఔట్​ చేసిన బౌలర్​గా రషీద్​ రికార్డు
author img

By

Published : Mar 26, 2021, 5:56 PM IST

Updated : Mar 26, 2021, 8:00 PM IST

పుణె వేదికగా భారత్​తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్​ ఓ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీని ఔట్​ చేసిన ఆదిల్​.. అంతర్జాతీయ క్రికెట్​లో ఇప్పటి వరకు 9 సార్లు అతడి వికెట్​ను తీశాడు. ఈ ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో రషీద్​ రెండో స్థానంలో నిలిచాడు.

విరాట్​ను అత్యధిక సార్లు పెవిలియన్​ చేర్చిన బౌలర్లలో కివీస్​ క్రికెటర్​ టిమ్​ సౌథీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 10 సార్లు కోహ్లీని పెవిలియన్​ చేర్చాడు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్​ అండర్సన్, గ్రేమ్​ స్వాన్​లు 8 సార్లు విరాట్​ వికెట్​ దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్​లోనూ విరాట్​ వికెట్​ను రెండు సార్లు తీశాడు ఆదిల్​ రషీద్​.

ఇదీ చదవండి: కోహ్లీ మరో ఫీట్​.. మూడో స్థానంలో 10వేల పరుగులు

Last Updated : Mar 26, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.