ఆస్ట్రేలియాతో పర్యటనకు సిద్ధమైన టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ.. మిగిలిన ఆటగాళ్ల కంటే బీసీసీఐ ఏర్పాటు చేసిన కొత్త బయో బబుల్లోనికి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఐపీఎల్లో భాగస్వామ్యం కానీ టెస్టు ఆటగాళ్లు పుజారా, విహారి బుడగలోకి ప్రవేశించిన ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించేశారు.
"ఐపీఎల్లో హైదరాబాద్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ పూర్తయిన రోజే.. అదే రాత్రి బయోబబుల్‌లోకి కోహ్లీ అడుగుపెట్టాడు. ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ప్రాక్టీసు మొదలుపెడతాడు" అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
నవంబరు 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ పూర్తవుతుంది. 12వ తేదీన జట్టులోని 32 మంది ఆటగాళ్లతో కలిసి టీమ్ఇండియా ప్రత్యేక విమానంలో సిడ్నీ చేరుకుని, అక్కడే ఏర్పాటు చేసిన క్వారంటైన్లోకి వెళ్తుంది.
నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు జరగనున్నాయి.