ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు చివరి రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమ్‌ఇండియా 206/3తో కొనసాగుతోంది. రిషభ్ పంత్(73) ధాటిగా ఆడుతుండగా, పుజారా (41) పూర్తి రక్షణాత్మకంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 104 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.
అంతకుముందు టీమ్‌ఇండియా 98/2తో ఐదో రోజు ఆటను ప్రారంభించగా ఆదిలోనే కెప్టెన్ రహానె(4) ఔటయ్యాడు. లియోన్ బౌలింగ్‌లో వేడ్ చేతికి చిక్కడం వల్ల భారత్ 102 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. విజయం కోసం భారత్ ఇంకా 201 పరుగులు చేయాలి.