ETV Bharat / sports

విహారీ, పంత్ సెంచరీలు.. పటిష్ఠ స్థితిలో భారత్

author img

By

Published : Dec 12, 2020, 5:41 PM IST

ఆస్ట్రేలియా-ఎతో జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్​లో టీమ్ఇండియా సత్తాచాటుతోంది. తొలి ఇన్నింగ్స్​లో 86 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ ముందు 472 పరుగుల ఆధిక్యం ఉంచింది.

IND vs AUS A practice match: Pant, Vihari shines.. India lead by 472 runs
విహారీ, పంత్ సెంచరీలు.. పటిష్ఠ స్థితిలో భారత్

ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్​లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్​లో 86 పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమ్​ఇండియా రెండో ఇన్నింగ్స్​లోనూ సత్తాచాటుతోంది. ప్రస్తుతం రెండో రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

తొలి ఇన్నింగ్స్​లో 86 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన భారత్ సత్తాచాటింది. ఓపెనర్ పృథ్వీ షా 3 పరుగులకే ఔటైనా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (61), శుభ్​మన్ గిల్ (65) రెండో వికెట్​కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రహానే 38 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత హనుమ విహారీ, రిషబ్ పంత్ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి విహారీ 104, పంత్ 103 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 4 వికెట్ల నష్టానికి 386 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ ముందు 472 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్​లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్​లో 194 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్‌ గిల్ (43), పృథ్వీ షా (40) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ తేలిపోయిన వేళ బుమ్రా (55*) బ్యాటుతో ఆకట్టుకున్నాడు. అజేయ అర్ధశతకంతో సత్తాచాటాడు. ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లో అతడికి ఇదే తొలి అర్ధశతకం. అయితే బుమ్రా సిక్సర్‌తో ఈ ఘనత సాధించడం విశేషం. 123 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సిరాజ్‌ (22)తో కలిసి బుమ్రా ఆదుకున్నాడు. ఆఖరి వికెట్‌కు 71 పరుగులు జోడించాడు.

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ.. 108 పరుగులకే కుప్పకూలింది. షమీ (3/29), సైనీ (3/19), బుమ్రా (2/33) మెరిశారు. సిరాజ్‌ ఓ వికెట్ తీశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో అలెక్స్‌ కేరీ (32), హ్యారిస్‌ (26) ఎక్కువ పరుగులు చేశారు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టులో నలుగురు బ్యాట్స్‌‌మెన్‌ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, పుజారా, కేఎల్ రాహుల్‌ ఆడలేదు. పంత్‌ వికెట్‌ కీపింగ్ బాధ్యతలు అందుకోగా సాహా ఫీల్డింగ్ చేశాడు.

ఇవీ చూడండి.. రోహిత్ శర్మ ఫిట్.. కానీ: బీసీసీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.