బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా గెలవాలంటే ఇంకా 309 పరుగులు చెయ్యాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(9), రహానె(4) ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ(52), శుభ్‌మన్‌గిల్(31) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు.
ఈ క్రమంలోనే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో గిల్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై పుజారా క్రీజులోకి రావడం వల్ల కాసేపటికే రోహిత్ అర్ధశతకం సాధించాడు. 30వ ఓవర్‌లో లియోన్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన హిట్‌మ్యాన్ విదేశాల్లో టెస్టు ఓపెనర్‌గా తొలి అర్ధశతకం నమోదు చేశాడు. ఇక తర్వాతి ఓవర్‌లోనే కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద స్టార్క్ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్ స్కోర్ 92/2గా నమోదైంది.
ఇదీ చూడండి: భారత్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ