ETV Bharat / sports

బిగ్​బాష్​​లో మరో​ 'సూపర్​ మ్యాన్​ క్యాచ్'​ - ben laughlin super caught

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్​బాష్​ లీగ్​లో అద్భుత క్యాచ్​ను ఒడిసిపట్టాడు బ్రిస్బేన్​ హీట్​ ఆటగాడు బెన్​ లాఫ్లిన్​. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. లాఫ్లిన్​.. సూపర్​మ్యాన్​ను తలపించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

incredible-catch-from-ben-laughlin
బిగ్​బాష్​​లో మరో​ 'సూపర్​ మ్యాన్​ క్యాచ్'​
author img

By

Published : Jan 30, 2021, 9:00 AM IST

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో మరో కళ్లుచెదిరే క్యాచ్‌. బ్రిస్బేన్‌ హీట్‌ ఆటగాడు బెన్‌ లాఫ్లిన్‌ సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. అడిలైడ్ స్టైకర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆఫ్‌స్టంప్‌ అవతలకు లబుషేన్‌ వేసిన లో ఫుల్‌టాస్‌ను మైకేల్‌ నెసర్‌.. కవ్‌ కార్నర్‌ (డీప్‌ మిడ్‌ వికెట్‌-లాంగ్‌ ఆన్ మధ్యలో) మీదుగా భారీ షాట్ ఆడాడు. లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లాఫ్లిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అద్భుతమైన క్యాచ్‌, సూపర్‌మ్యాన్‌లా లాఫ్లిన్‌‌ క్యాచ్‌ అందుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో అడిలైడ్‌పై బ్రిస్బేన్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్‌ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చదవండి: 'ఆసీస్​​ అనుభవాన్ని ఇంగ్లాండ్​పై చూపిస్తా'​

ఇదీ చదవండి: బిగ్​బాష్​​లో 'సూపర్​ క్యాచ్​'... ఔటా? నాటౌటా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.