రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ బట్లర్‌ను... మన్కడింగ్ పద్ధతిలో అశ్విన్ ఔట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్ధమని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఈ విషయంపై స్పందించారు. ఓ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో మన్కడింగ్‌కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ సమావేశంలో ధోని, కోహ్లి కూడా పాల్గొన్నారని చెప్పారు.
"మన్కడింగ్ విధానంలో బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడం సరైంది కాదని ఇంతకు ముందే జరిగిన ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఓ ఐపీఎల్ సీజన్ ప్రారంభ సమయంలో దీనిపై చర్చించాం. ధోని, కోహ్లితో పాటు అన్ని జట్ల కెప్టెన్లు, మ్యాచ్ రిఫరీలు హాజరయ్యారు "
- రాజీవ్ శుక్లా, ఐపీఎల్ ఛైర్మన్