ETV Bharat / sports

'బ్యాట్స్​మెన్ అలా చేస్తే.. కెప్టెన్​కు ఒత్తిడి తగ్గినట్లే' - బౌలర్​గా యువీ

జట్టులోని బ్యాట్స్​మెన్​కు​ బౌలింగ్ చేసే సత్తా ఉండాలని మాజీ ఆటగాడు సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. అలా ఉంటే కెప్టెన్​కు కీలక సమయాల్లో అతడు ఉపయోగపడతాడని చెప్పాడు. తద్వారా సారథికి ఒత్తిడి తగ్గుతుందని అన్నాడు.

Suresh Raina
బ్యాట్స్​మన్ బౌలింగూ చేయగలగాలి: రైనా
author img

By

Published : Dec 9, 2020, 5:13 PM IST

బౌలింగ్​ వేసే సామర్థ్యం ఉన్న బ్యాట్స్​మెన్ జట్టులో ఉంటే కెప్టెన్​కు కీలక సమయాల్లో ఉపయోగపడతారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. దేశవాళీ​ టోర్నీల్లో పాల్గొనప్పుడు తాను బౌలింగ్​ కూడా వేసేవాడని తెలిపాడు. టీమ్​ఇండియాలోనూ స్పిన్నర్​గా బాధ్యతలు నిర్వర్తించానని అన్నాడు. 'ఫ్రంట్​ రో' యాప్ ఆవిష్కరణలో భాగంగా రైనా పై వ్యాఖ్యలు చేశాడు.

"బ్యాట్స్​మన్ బౌలింగ్​ చేయడమే కాదు, బౌలర్లు కూడా బ్యాటింగ్​ చేయగలగాలి. ఇది జట్టుకు చాలా ఉపయోగపడే అంశం. బ్యాట్స్​మన్​ కనీసం 4-5 ఓవర్లు బౌలింగ్ చేస్తే, అది కెప్టెన్​కు ఒత్తిడి తగ్గిస్తుంది" అని సురేశ్ రైనా చెప్పాడు.

2011 ప్రపంచకప్​లో సచిన్, సెహ్వాగ్​, యువరాజ్ కూడా మంచి బౌలర్లుగా ఉండేవారని రైనా గుర్తుచేశాడు. కెరీర్​ ప్రారంభంలో బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లో రాణించిన వారికే అవకాశం దక్కేదని చెప్పాడు. ప్రస్తుతం టీమ్​ఇండియా టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ ఎవరూ బౌలింగ్​ చేయలేకపోతున్నారని రైనా అన్నాడు.

ఇదీ చదవండి:అంజూ.. పతకంతో పాటు మనసుల్ని గెలిచింది అలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.