ETV Bharat / sports

'కేఎల్ రాహుల్ మాటలు ఎప్పటికీ మర్చిపోను' - kl rahul news

భారత జట్టు వికెట్​ కీపర్ రాహుల్​ తనపై చూపిన చొరవ ఎప్పటికీ మరచిపోనని ఆసీస్ క్రికెటర్​ గ్రీన్ చెప్పాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్​ విశేషాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నాడు.

'I'll remember it forever': The KL Rahul gesture which floored debutant Cameron Green
'కేఎల్​ రాహుల్ చూపిన​ చొరవ ఎప్పటికీ మరచిపోలేను'
author img

By

Published : Dec 3, 2020, 8:36 PM IST

టీమ్​ఇండియాతో చివరి వన్డేలో ఆ జట్టు వికెట్​ కీపర్​ కేఎల్​ రాహుల్​ తనతో చెప్పిన మాటలు ఎప్పటికీ మరచిపోనని ఆస్ట్రేలియా యువ క్రికెటర్​ కామెరూన్​ గ్రీన్​ అన్నాడు. బ్యాటింగ్​లో కొంత ఒత్తిడికి లోనవుతున్న సమయంలో తనలోని విశ్వాసం నింపాడని చెప్పాడు. ఈ విషయాన్ని తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని మ్యాచ్​ అనంతరం​ వెల్లడించాడు.

"నేను బ్యాటింగ్​ చేస్తున్నప్పుడు కేఎల్​ రాహుల్​ స్టంప్స్​ వెనుక ఉన్నాడు. నాలో ఒత్తిడి గమనించి 'ఒత్తిడితో ఉన్నావా'? అని అడిగినట్లు అనిపించింది. 'అవును, కొంచెం ఒత్తిడిగా భావిస్తున్నా' అని సమాధానమిచ్చా. 'మరేం పర్వాలేదు.. బాగా ఆడు' అనే విధంగా ఏదో చెప్పి నాలో ఉత్సాహం నింపాడు. అంతకుముందు బౌలింగ్​ చేస్తున్నప్పుడు కోహ్లీ నాతో ఏదో అనాలని ప్రయత్నించాడు. అప్పుడు ఫించ్​ కలుగజేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాలను నేనెప్పటికీ మర్చిపోలేను"

- కామెరూన్​ గ్రీన్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

ఆస్ట్రేలియాకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన 230వ క్రికెటర్​ కామరూన్​ గ్రీన్​. టీమ్​ఇండియాతో బుధవారం జరిగిన మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్​లో నాలుగు ఓవర్లు బౌలింగ్​ చేసినా సరే వికెట్​ తీయలేకపోయాడు. బ్యాటింగ్​లో 27 బంతులను ఎదుర్కొని 21 పరుగులు చేశాడు. అందులో సిక్సర్, ఫోర్ ఉన్నాయి. ఇదే మ్యాచ్​తో టీమ్​ఇండియా ఆటగాడు నటరాజన్​కూడా అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.